TS TET Exams 2025:
తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TS TET 2025) పరీక్షలను ఈరోజు నుండి అనగా జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు మొత్తం 16 రోజులపాటు, రోజుకి రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 1,83,653 అభ్యర్థులు పేపర్ 1 మరియు పేపర్ 2 కు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని నిర్ణీత గడువులోగా పరీక్షకు హాజరు కావలెను.పరీక్షలు పూర్తయిన మూడు నుండి నాలుగు రోజుల్లో గా ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత జూలై నెలలో ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
TS TET పరీక్ష తేదీలు & టైమింగ్స్:
- టెట్ పరీక్షలు ప్రారంభమయ్యే తేదీ : జూన్ 18, 2025
- టెట్ పరీక్షలు ముగిసే తేదీ : జూన్ 30, 2025
- మొత్తం ఎన్ని సెషన్లు : 16 సెషన్లు ( ప్రతిరోజు రెండు సెషన్స్ )
- మొదటి సెషన్ ప్రారంభమయ్యేది : ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు
- రెండో సెషన్ ప్రారంభమయ్యేది : మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు
మొత్తం ఎంతమంది పరీక్ష రాయనున్నారు?:
- మొత్తం వచ్చిన దరఖాస్తులు : 1,83,653
- పేపర్ 1 కు అప్లై చేసిన వారు : 63,621
- పేపర్ 2 కు అప్లై చేసిన వారు : 1,20,392
RTC లో స్కూల్ స్టూడెంట్స్ కి ఉచితంగా బస్సు పాసులు : apply చేయండి
TS TET హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి?:
తెలంగాణ టెట్ పరీక్ష హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది స్టెప్ డే స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి
- ముందుగా తెలంగాణ టెట్ అధికారికి వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ టిఫిన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” download TET hall tickets” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. ప్రింట్ అవుట్ తీసుకోండి.
TS TET Official Website: Hall Tickets
AP మెగా డీఎస్సీ 2025 ఆన్సర్ కీలు విడుదల
TS TET ప్రాథమిక ఆన్సర్ కి మరియు ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు?:
- ప్రాథమిక కి (Preliminary Key): తెలంగాణ టెట్ పరీక్షలు పూర్తయిన మూడు నుంచి నాలుగు రోజుల్లో ప్రాథమిక కీని విడుదల చేస్తారు
- అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీపై అభ్యంతరాలను సబ్మిట్ చేయడానికి ప్రత్యేకమైన లింకు ఏర్పాటు చేస్తారు
- ఫైనల్ ఆన్సర్ కి : వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కి విడుదల చేస్తారు.
- టెట్ ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు: జూలై మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు :
- పరీక్షకు హాజరైన అభ్యర్థులు నిర్ణీత గడువులేగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి హాజరవ్వాలి.
- సెల్ ఫోన్, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబడదు.
- హాల్ టికెట్ తో పాటు అభ్యర్థులు వారి యొక్క ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా తీసుకెళ్లాలి.
పెట్టలో అర్హత సాధించినటువంటి వారికి డీఎస్సీ పరీక్షల్లో 20% వరకు వెయిటేజ్ మార్కులు కలుస్తాయి. కావున టెట్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది ఎంతో కీలకమైనది.
