APSRTC Free Bus Pass For AP Students:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకుగాను, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు పాసులు ఇవ్వడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఒకటో తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఆన్లైన్ లో గాని లేదా డైరెక్ట్ బస్సు డిపో కి వెళ్లి బస్సు పాసులు తీసుకోవచ్చు. దీని ద్వారా వారికి ప్రయాణ ఖర్చులు 100% తగ్గుతాయి.
ఉచిత బస్సు పాసుల పంపిణీ ఎప్పటినుండి ప్రారంభం:
జూన్ 12, 2025 నుండి విద్యా సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా జూన్ 13వ తేదీ నుండి ఏపీఎస్ఆర్టీసీ స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ యొక్క ప్రయాణ వివరాలను ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://buspassonline.apsrtconline.in/ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
బస్సు పాస్ పొందడానికి అవసరమైన డాక్యుమెంట్స్?:
- విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్
- విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
- స్కూల్ హెడ్మాస్టర్ సర్టిఫికెట్
- బస్సు పాసులు తీసుకోవడానికి స్కూలు హెడ్మాస్టర్ నుంచి ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసిన దరఖాస్తు ఫారం.
ఏపీ మెగా డీఎస్సీ 2025 ఆన్సర్ కీలు విడుదల: డౌన్లోడ్ చేయండి
బస్సు పాస్ ఎక్కడ అందుబాటులో ఉంటుంది?:
ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు వెళ్లే స్కూల్ విద్యార్థులు ఉచిత బస్సు పాసుల కొరకు (Bus Pass Counter) ను సంప్రదించాలి. పాఠశాలల వద్దే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు
ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులకు బస్సు పాసులు ఎలా ఇస్తారు?:
ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు లేవు. అయితే వారికి సబ్సిడీ రేట్లతో మూడు నెలలు, ఆరు నెలలు, లేదా ఏడాదికాలానికి సరిపోయే బస్సు పాసులు ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా ముందుగా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి.
ఇది ఆడబిడ్డ నిధి పథకం: అర్హతలు, అప్లై ప్రాసెస్
ముఖ్యమైన సూచనలు:
- ఇప్పటికే బస్సు ఉన్నవారు దానిని పునరుద్ధరించుకోవాలి లేదా కొత్తది తీసుకోవాలి.
- ప్రతి ఒక్క విద్యార్థికి ఒకే ఒక్క ఫ్రీ పాస్ మాత్రమే మంజూరు అవుతుంది
- విద్యార్థి ప్రయాణించే దూరాన్ని బట్టి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సరైన బస్సు పాస్ మంజూరు చేస్తారు.
APSRTC free bus pass application website
ఈ సదుపాయం ద్వారా విద్యార్థులకు ప్రయాణ ఖర్చులతో పాటు ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు కావడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతుంది. స్కూల్ కి వెళ్లే మీ పిల్లల ప్రయోజనం కోసం వెంటనే ఉచిత బస్సు పాస్ కోసం దరఖాస్తు చేసుకోండి.
