ఏపీ తల్లికి వందనం డబ్బులు రాలేదా? మరో కొత్త జాబితా: ఇలా చేస్తే వారికి జూలై 5న డబ్బులు జమవుతాయి

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద జూన్ 12వ తేదీన పథకాన్ని ప్రారంభించి 13వ తేదీ నుండి ఈరోజు వరకు డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసింది.అయితే కొంతమంది తల్లులకు వారి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదు అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డబ్బులు జమ కాని వారికి మరొక ఆఖరి అవకాశం కల్పిస్తూ జూన్ 20వ తేదీలోగా వారు ఫిర్యాదులు సచివాలయంలో సమర్పించే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. డబ్బులు రానివారు ఫిర్యాదు చేసినట్లయితే, జూన్ 28వ తేదీలోగా వారి యొక్క ఫిర్యాదులను వెరిఫై చేసి, జూన్ 30వ తేదీన కొత్త అర్హుల జాబితాను సచివాలయంలో ప్రదర్శిస్తారు. ఇలా ప్రదర్శించబడిన వారి యొక్క కొత్త జాబితా కి సంబంధించిన లబ్ధిదారులకు జూలై 5వ తేదీన డబ్బులు చెల్లిస్తారు. కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ కి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ముఖ్యమైన తేదీలు – కొత్త షెడ్యూల్ ఇదే:

Join Whats App Group

  • జూన్ 20: డబ్బులు జమ కాని వారు గ్రామ సచివాలయంలో ఫిర్యాదులు సమర్పించడానికి జూన్ 20వ ఆఖరి తేదీ.
  • జూన్ 28: ఫిర్యాదులు చేసిన లబ్ధిదారుల యొక్క అప్లికేషన్స్ ని జూన్ 28వ తేదీ వరకు వెరిఫై చేస్తారు.
  • జూన్ 30: ఫిర్యాదులను వెరిఫై చేసిన తర్వాత లబ్ధిదారుల యొక్క కొత్త జాబితాను జూన్ 30వ తేదీన గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.
  • జూలై 5: కొత్త జాబితాలో ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన 13 వేల రూపాయలు తల్లికి వందనం పథకం కింద అకౌంట్లో జమ చేస్తారు.

ఏపీ తల్లికి వందనం డబ్బుల డిపాజిట్ కానివారు ఈ గ్రీవెన్స్ ఫారం సబ్మిట్ చేయండి

ఎవరు ఫిర్యాదు చేయాలి?:

ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగినప్పటికీ, డబ్బులు తమ యొక్క ఖాతాలో డిపాజిట్ కానీ లబ్ధిదారులు జూన్ 20వ తేదీలోగా ఫిర్యాదులు సమర్పించాలి. గ్రామ వార్డు సచివాలయంలో ప్రత్యేక ఫిర్యాదు ఫారం ని తీసుకొని అది ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఏపీ ఆడబిడ్డ నిధి పథకం,అర్హతలు ఎలా అప్లై చేయాలి

ఫిర్యాదులు సమర్పించే విధానం?:

  1. మీ దగ్గరలోని గ్రామ సచివాలయానికి వెళ్లి తల్లికి వందనం ఫిర్యాదు ఫారం ని అడగండి.
  2. వెళ్లే ముందు మీ యొక్క బ్యాంకు ఖాతా, మీ ఆధార్ కార్డ్, పిల్లల ఆధార్ కార్డు, పిల్లల స్కూల్ హాజరు సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళండి
  3. ఫిర్యాదు ఫారం ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి.
  4. జూలై 5వ తేదీ నాటికి మీకు డబ్బులు వచ్చినా రాకపోయినా మీ యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు.

డబ్బుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:

తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు డబ్బులు స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీ మొబైల్ లోని వాట్సాప్ లో ఆంధ్రప్రదేశ్ మనం మిత్ర నెంబర్ ని సేవ్ చేసుకొని, మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదా గ్రామ సచివాలయానికి వెళ్లి మీ యొక్క జాబితాను చూసి అందులో మీరు లబ్ధిదారులు అవునా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు.

కొత్త జాబితా విడుదల తేదీ:

తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ 20వ తేదీ వరకు ఫిర్యాదులు చేసిన వారి ఫిర్యాదులను వెరిఫై చేసి జూన్ 30వ తేదీన కొత్త జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. మీరు అక్కడికి వెళ్లి మీ యొక్క జాబితాను చూసుకోవచ్చు.

డబ్బులు డిపాజిట్ కాలేదు అని బాధపడుతున్న విద్యార్థుల తల్లులు ఈ ఆఖరి సారిగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూన్ 20వ తేదీలోగా ఫిర్యాదులను సమర్పించండి. ఎన్ని సంవత్సరాలు వరకు ఇలాంటి అవకాశం రాదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.