AP Aadabidda Nidhi Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా సూపర్ సిక్స్ పథకాల్లో మరొక అతి ముఖ్యమైన పథకమైనటువంటి ” ఆడబిడ్డ నిధి ” పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వచ్చిన వెంటనే ఈ పథకం గురించి ప్రక్కన జారీ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 18 నుండి 59 సంవత్సరాలు మధ్య వయసున్న మహిళలందరికీ అకౌంట్లో 1500 రూపాయలు జమ చేసే విధంగా ఎన్నికల హామీల్లో ఇవ్వడం జరిగింది.ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో 3000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆడబిడ్డ నిధి పథకం లక్ష్యం?:
రాష్ట్రంలో 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ఆర్థిక తోడ్పాటు అందించే విధంగా నెలకు 1500 రూపాయలు వారీ అకౌంట్లో డిపాజిట్ చేసి, వారికి ఆర్థిక మద్దతు కల్పించే విధంగా ఈ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ పథకానికి కావలసిన అర్హతలు:
ఏపీలో తల్లికి వందనం పథకం లాగానే మరొక పద్ధకం విడుదల: ₹15,000/- డిపాజిట్ : Apply
- దరఖాస్తు చేసుకునే మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి
- ప్రతి మహిళ యొక్క వయసు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి
- కుటుంబం యొక్క వార్షిక ఆదాయం నిర్దిష్ట పరిమితిలో ఉండాలి ( ఆదాయానికి సంబంధించిన అధికారికి గైడ్లైన్స్ ఇంకా విడుదల కాలేదు )
- తెల్ల రేషన్ కార్డు కలిగి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు.
తల్లికి వందనం పథకం స్టేటస్ ని మీ వాట్సాప్ లో ఎలా చెక్ చేసుకోండి
ఈ పథకానికి కావలసిన సర్టిఫికెట్స్ ఏమిటి?:
- లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు
- రేషన్ కార్డ్
- వయోపరిమితి గురించి తెలిపే సర్టిఫికెట్ ( పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో )
- లబ్ధిదారుని బ్యాంకు ఖాతా వివరాలు
- నివాస ధ్రువీకరణ పత్రం.
ఏపీ తల్లికి వందనం పథకం కొత్త లిస్టు విడుదల : వీరికి జూలైలో డబ్బులు జమ
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులైన మహిళలు మరి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రస్తుతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నందున, మరి కొద్ది రోజుల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పథకం ప్రారంభించిన తర్వాత అభ్యర్థులు దగ్గర్లోని గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో 3300 కోట్ల రూపాయల కేటాయించిన విషయం తెలిసిందే.
ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే కచ్చితంగా మా వెబ్సైట్ ద్వారా మీకు వివరాలు అందిస్తాము. కావున ప్రతి ఒక్కరూ మా వెబ్సైట్ యొక్క టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
