Postal GDS 2025 4th merit list released:
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఫిబ్రవరి 2025 విడుదలైన 21,413 పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 4th మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. పదో తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా 2025 ఫిబ్రవరిలో అవకాశం కల్పించారు. ఇప్పటివరకు మూడు మెరిట్ లిస్టులను విడుదల చేసిన పోస్టల్ శాఖ వారు, ఇప్పుడు నాలుగో మెరిట్ లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది. ఆ నాలుగో మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి గడువులోగా హాజరయ్యే సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలి. ఈ మెరిట్ లిస్టు కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
పోస్టల్ GDS పోస్టులు మొత్తం ఎన్ని విడుదల చేశారు?:
21,413 పోస్టులతో ఫిబ్రవరి 2025న అధికారికంగా పోస్టల్ శాఖ వారు రాష్ట్రాల వారి ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కొన్ని లక్షల మంది ఈ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా కంప్యూటర్ జనరేటర్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి, ఈ ఉద్యోగాలు అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది.
పోస్టల్ GDS 4th మెరిట్ లిస్టు ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 4th మెరిట్ లిస్టు ని ఈ క్రింది స్టెప్ డే స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
ఏపీ ఆడబిడ్డ నిధి పథకం 2025 అర్హతలు మరియు అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా పోస్టల్ GDS వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” postal GDS online engagement schedule one January 2025 shortlisted candidates ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అక్కడ రాష్ట్రాలవారీగా 1st మెరిట్ లిస్టు నుండి 4th మెరిట్ లిస్ట్ వరకు షార్ట్ లిస్టు అయిన అభ్యర్థుల యొక్క జాబితా కి సంబంధించిన పిడిఎఫ్ లు ఉంటాయి అవి డౌన్లోడ్ చేసుకోండి .
- ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది మీ యొక్క రిజిస్ట్రేషన్ ID ద్వారా సార్ చేసి చెక్ చేసుకోండి.
- ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీరు ఉద్యోగానికి ఎంపిక కాబడ్డారు అని అర్థం.
- ఆ రిజల్ట్ పిడిఎఫ్ లో ఇచ్చిన సర్టిఫికెట్ల గడువు తేదీలోగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరయ్యి సర్టిఫికెట్లను సబ్మిట్ చేయండి.
Results PDF’s:
AP Postal GDS Results: 4th Merit List
TS Postal GDS Results: 4th Merit List
పైన ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేసారో, ఆ రాష్ట్రానికి సంబంధించిన 4th మెరిట్ లిస్టు డౌన్లోడ్ చేసుకుని,మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
