AP EAMCET 2025 Phase 2 Results:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను జూన్ 8వ తేదీన విడుదల చేసిన తర్వాత, కొంతమంది విద్యార్థులకు Rank Invalid చూపించడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాస్ కాని వారు, అలాగే ఇంటర్ మార్కుల వివరాల్లో ఎంసెట్ వెబ్సైట్ డిక్లరేషన్ ఫామ్ లో అప్లోడ్ చేయని అభ్యర్థులకి సంబంధించిన ఎంసెట్ 2025 ర్యాంకులను చూపించలేదు. అయితే వారు జూన్ 15వ తేదీ వరకు వారి యొక్క ఇంటర్ మార్కుల వివరాలను డిక్లరేషన్ ఫామ్ లో ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకునే విధంగా ఏపీ ఎంసెట్ కన్వీనర్సమయం ఇవ్వడం జరిగింది. అప్పటికే విడుదలైన ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను డిక్లరేషన్ ఫామ్ లో ఎంటర్ చేసి సబ్మిట్ చేశారు. అయితే ఇప్పుడు ఎవరికైతే ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్స్ విడుదల కాని వారు ఉన్నారో వారికోసం జూన్ 20వ తేదీలోగా AP EAMCET 2025 phase 2 results ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
AP ఎంసెట్ 2025 phase 2 రిజల్ట్స్ విడుదల ఎప్పుడు?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 Phase 2 ఫలితాలను జూన్ 20వ తేదీలలో విడుదల చేయనున్నారు. దాదాపు 15 వేల మంది విద్యార్థులకు ర్యాంకులు కేటాయించనందున, ఇటీవల జూన్ 15వ తేదీలోగా ఎవరైతే విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను డిక్లరేషన్ ఫామ్ లో అప్లోడ్ చేసే సబ్మిట్ చేశారో, వారి ఫలితాలను జూన్ 20వ తేదీలలో విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ ఎంసెట్ 2025 Phase 2 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?:
ఫలితాలను ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
ఏపీ ఎంసెట్ 2025 లో చాలా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కూడా మంచి సీట్స్ ఇచ్చే కాలేజీల వివరాలు
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో “Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్, రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
- వెంటనే విద్యార్థులు యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
- అది ప్రింట్ అవుట్ తీసుకొని, కౌన్సెలింగ్ కోసం భద్రపరుచుకోండి.
AP EAMCET 2025: Phase 2 Results
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 phase 2 ఫలితాలు ఎప్పటిలోగా విడుదల కానున్నాయి ?
జూన్ 20వ తేదీలోగా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
2. ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?
జూన్ చివరి వారంలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
3. ఏపీ ఎంసెట్ 2025 ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడు ప్రారంభం కానున్నాయి?
ఆగస్టు 14వ తేదీ కల్లా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ క్లాసెస్ ని ప్రారంభించాలని ఏఐసిటిఈ ఉత్తర్వులు జారీ చేసింది.
