TS inter supplementary results 2025:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ రాత పరీక్ష ఫలితాలను ఈరోజు అనగా జూన్ 16 మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు విడుదల చేశారు. మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే మళ్లీ ఫెయిల్ అయ్యారో లేదా ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో, అటువంటి విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్కు అప్లై చేసుకునే విధంగా అధికారులు అవకాశం ఇచ్చారు. జూన్ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్కు విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని ఫీజు చెల్లించవచ్చు. ఈ ప్రక్రియకి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకునే తేదీలు?:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తులు చేసుకోవడానికి జూన్ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. విద్యార్థులు ఆ తేదీలలోగా ఆన్లైన్లో గాని లేదా కళాశాల ప్రిన్సిపల్ ద్వారా గాని ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు ఎంత చెల్లించాలి?:
రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి సంబంధించి ఫీజు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- రీకౌంటింగ్ కొరకు : ₹100/- ఫీజు చెల్లించాలి.
- రీవెరిఫికేషన్ కొరకు: ₹600/- ఫీజు చెల్లించాలి.
పైన తెలిపినటువంటి దరఖాస్తు ఫీజులను ఆన్లైన్ లో చెల్లించవలెను.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల : Download Here
రీకౌంటింగ్ , రీవెరిఫికేషన్ కు ఎలా అప్లై చేసుకోవాలి?:
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- విద్యార్థులు రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకోవడానికి ఈ వెబ్సైట్ (Recounting Website) ఓపెన్ చేయండి
- విద్యార్థులు రీ వెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవడానికి ఈ వెబ్సైట్ (Reverification Website) ఓపెన్ చేయండి
- అందులో మీ పూర్తి వివరంగా నమోదు చేసి, ఫీజు చెల్లించి సబ్మిట్ చేయడమే.
- వీటి యొక్క ఫలితాలు జూన్ నెలాఖరులోగా విడుదల అయ్యే అవకాశం ఉంది.
పైన ఇచ్చిన లింక్స్ ఆధారంగా, విద్యార్థులు జూన్ 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్కు ఆన్లైన్ లో ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలి. మళ్లీ ఇలాంటి అవకాశం రాదు కాబట్టి మీకు అనుమానం ఉన్నట్లయితే కచ్చితంగా దరఖాస్తులు సబ్మిట్ చేయండి. మార్కులు కలవడం వల్ల మీకు స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది.
