పోస్టల్ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల కొరకు దరఖాస్తుల ఆహ్వానం: పూర్తి వివరాలు

పోస్టల్ శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్:

తెలంగాణ కరీంనగర్ లోని సామాన్య ప్రజలకు సరసమైన ప్రీమియం ఆఫర్లతో జీవిత బీమా సదుపాయం అందించాలనేటువంటి లక్ష్యంతో భారతదేశ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కీలక ముందడుగు వేశారు. కరీంనగర్ పోస్టల్ డివిజన్ పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ద్వారా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI ) పథకాన్నిప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈరోజు వచ్చిన ఈ సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

  • 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కేవలం 5000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి సర్టిఫికెట్ దాఖలు చేసుకోవచ్చు.
  • కమీషన్ బేసిస్పై జీవిత బీమా ఏజెంట్లుగా పని చేసే వారికి కూడా ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 27వ తేదీలోగా కరీంనగర్ డివిజన్ ఆఫీసులో తమ డాక్యుమెంట్లతో ఆఫీసులో హాజరు కాగలరు.

Join Whats App Group

అవసరమైన సర్టిఫికెట్ల వివరాలు :

  • ఆధార్ కార్డ్
  • పాన్ కార్డ్
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు

పోస్టల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా లభించే అటువంటి సేవలు?:

  1. పోస్టల్ శాఖ ద్వారా నమ్మకమైన జీవిత బీమా సేవలు పొందవచ్చు.
  2. స్వతంత్రంగా పనిచేయాలి అనుకునే వారికి ఉపాధి అవకాశం ఉంటుంది
  3. గ్రామీణ ప్రజలకు బీమా సేవలు చేరే అవకాశం వస్తుంది.

TGSRTC లో ఉచిత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : Apply

ఎవరికి ఉపయోగపడుతుంది?:

  1. జీవిత బీమా ఏజెంట్లుగా చేరాలనుకునే నిరుద్యోగులకు ఒక చక్కటి అవకాశం
  2. స్వయం ఉపాధి కోరుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు
  3. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఒక మంచి ఉపాధి.
  4. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు మరియు రిటైర్డ్ అయిన వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి?:

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 27వ తేదీలోగా కరీంనగర్ పోస్టల్ డివిజన్ ఆఫీసులో హాజరు కావలెను.అక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు, దరఖాస్తు ఫారంలు అందిస్తారు.

  • అభ్యర్థులు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని రావాలి.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ

పోస్టల్ ఏజెంట్ పని చేసే అవకాశం:

తపన శాఖలో ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా చేరాలి అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. కమిషన్ బేసెస్ పై జీవిత బీమా ఏజెంట్లుగా పని చేయవచ్చు. ఇది ఒక మంచి ఉపాధి అవకాశాలకు కూడా దోహదం చేస్తుంది. పోస్టల్ ఏజెంట్లుగా జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఐదు వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి.

తెలంగాణ తపాలా శాఖ విడుదలైన జీవిత బీమా ఏజెంట్లు నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది