AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం 2025 పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) నిన్న జూన్ 12వ తేదీన అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా స్కూలుకి పిల్లలను పంపే తల్లులకు 15000 రూపాయల ఆర్థిక సాయం అందనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవ విడుదల చేసి షెడ్యూల్ ని ప్రకటించడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఎలిజిబుల్ అభ్యర్థులు, అర్హత లేని అభ్యర్థుల వివరాల లిస్టు ఎక్కడ చూసుకోవాలి, అభ్యంతరాలు ఉంటే వాటిని ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏ తేదీలోపు సబ్మిట్ చేయాలి. లిస్టులో పేరు లేని వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి?, డబ్బులు డిపాజిట్ అయ్యేది ఎప్పుడు?. ఇలా పూర్తి వివరాలతో కూడినటువంటి షెడ్యూల్ ని విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు( official schedule):
| కార్యాచరణ | తేదీలు |
| 54,94,703 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం విడుదల తేదీ | 12th జూన్ 2025 |
| అర్హులు, అనర్హుల జాబితా ప్రచురణ తేదీ | 12th జూన్ 2025 |
| అభ్యంతరాల స్వీకరణ తేదీ | 12th జూన్ 2025 నుండి 20th జూన్ 2025 |
| అభ్యంతరాల వెరిఫికేషన్ మరియు అదనపు లిస్టు తయారు చేసే తేదీ | 21st జూన్ 2025 నుండి 28th జూన్ 2025 |
| ఫైనల్ లిస్ట్ విడుదల తేదీ (1st క్లాస్ నుండి ఇంటర్ వరకు ) | 30th జూన్ 2025 |
| లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేసే తేదీ | 5th జూలై 2025 |
Eligible & Ineligible List ఎక్కడ? ఎలా చెక్ చెయ్యాలి?:
తల్లికి వందనం పథకం పెద్ద ట్విస్ట్ : ₹15,000/- కాదు ₹13,000/- డిపాజిట్
- మీ అంతట మీరే అధికారిక వెబ్సైట్లో లిస్టు చెక్ చేసుకోలేరు. మీ దగ్గరలోని గ్రామ సచివాలయంలో అధికారులను సంప్రదించినట్లయితే వారు ఈ పథకానికి అర్హత కలిగిన వారు అర్హత లేని వారి వివరాల లిస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
- అందులో మీ పేరు ఉందా? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
- మీ విద్యార్థి ID/ మీ ఆధార్ నంబర్ ఆ లిస్టులో ఉందా లేదా అనేది చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు
- మీ పేరు Eligible జాబితాలో ఉంటే మీకు డబ్బులు డిపాజిట్ అవుతాయి.
- మీ పేరు ineligible జాబితాలో ఉంటే డబ్బులు డిపాజిట్ కావు.
- Ineligible జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే మీరు జూన్ 20, 2025వ తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకోవచ్చు
మీ పేరు లిస్ట్ లో లేకపోతే ఏమి చెయ్యాలి?:
- మీ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించగలరు.
- అప్లికేషన్ స్టేటస్, ఆధార్ నంబర్ సరిగ్గా లేకపోవడం, స్కూల్ అటెండెన్స్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా ఇవ్వడం వంటి సమస్యల కారణంగా మీ పేరు లేకపోవచ్చు.
- ఈ కారణాలవల్ల పేరు లేని వారు, అభ్యంతరాలు రాసి మరొక ఫామ్ సబ్మిట్ చేయవలెను.
తల్లికి వందనం పథకం మీ పేరు ఉందా లేదా స్టేటస్ చెక్ చేసుకోండి
అభ్యంతరాలు (Grievances) ఎలా ఇవ్వాలి?:
- మీ అభ్యంతరాలను సబ్మిట్ చేయడానికి సచివాలయంలో గ్రీవెన్స్ ఫారం (అభ్యంతరాల ఫారం) పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
- సంబంధిత సమస్య ఏమిటో(లిస్టులో పేరు లేకపోవడం, ఎకౌంట్ నెంబర్ తప్పులు) క్లియర్ గా చెప్పాలి
- ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, బ్యాంకు పాస్ బుక్, స్టూడెంట్ ఐడి సర్టిఫికెట్స్ చెత్త చేయాలి.
- మీ పిల్లవాడి యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం కూడా అవసరం.
₹15,000/- కాకుండా ₹13,000/-ఎందుకు జమ చేస్తున్నారు?:
- ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు హెల్త్ కేర్ కోసం 2000 మినహాయించడం జరిగిందని తెలిపారు.
- కాబట్టి తల్లి ఖాతాలోకి ₹15,000/- బదులుగా ₹13,000/- రూపాయలు మాత్రమే నేరుగా డిపాజిట్ అవుతాయి.
తల్లికి వందనం పథకానికి కొత్తవారు ఇలా వెంటనే అప్లై చేయండి
ఫైనల్ గా అకౌంట్ లోకి డబ్బులు ఎప్పుడు జమవుతాయి?:
- పూర్తిగా ఎలిజిబుల్ అయిన వారికి జూన్ 12, 2025 న డిపాజిట్ అవుతాయి.
- సప్లిమెంటరీ లిస్టులో ఉన్న వారికి జూలై 5, 2025 న డిపాజిట్ అవుతాయి.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు విసిట్ చేయండి.
