AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లాడికి ₹15,000 రూపాయలు చొప్పున డబ్బులు జమ చేయడానికి తల్లికి వందనం పథకం(Thalliki Vandanam Scheme 2025) ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అదే రోజున అర్హులైన తల్లుల ఖాతాల్లోకి 15 వేల రూపాయలు జమ చేయనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ₹8,745కోట్లు కేటాయించింది.
తల్లికి వందనం పథకం (Thalliki Vandanam Scheme) అర్హతలు ఏమిటి?:
- ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుండి 12th క్లాస్ వరకు
- ఆదర్శ పాఠశాలలు, మున్సిపల్ , జడ్పీ, మోడల్ స్కూల్ ల విద్యార్థులు
- ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ చదువుతున్న విద్యార్థులు
- విద్యార్థి యొక్క తల్లి ఏపీ రాష్ట్రానికి చెందిన నివాసి అయి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- విద్యార్థికి 75% హాజరు ఉండాలి
అప్లికేషన్ ప్రాసెస్:
- ఆటోమేటిక్ లింకింగ్ : పాఠశాలల ద్వారా విద్యార్థుల వివరాలను మండల విద్యాధికారి కార్యాలయానికి పంపించబడతాయి.
- వెరిఫికేషన్ ప్రక్రియ: తల్లి ఒక బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్తో లింకు చేసి ఉండాలి. అలాగే తల్లి యొక్క బ్యాంకు ఖాతా వివరాలను డేటా బేస్ లో నుండి మ్యాచింగ్ జరుగుతుంది.
- డైరెక్ట్ డబ్బులు జమ : అన్ని రకాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, తల్లి ఖాతాలోకి ₹15,000/- జమ అవుతాయి.
ఏపీ ఎంసెట్ 2002 ఇంటర్ విద్యార్థులు మార్కులను అప్లోడ్ చేయాలి
అవసరమైన డాక్యుమెంట్స్:
- విద్యార్థి యొక్క స్కూల్ అటెండెన్స్ రికార్డ్
- తల్లి యొక్క బ్యాంకు ఖాతా వివరాలు
- తల్లి ఆధార్ కార్డ్
- విద్యార్థి ఆధార్ నెంబర్
ఎవరెవరికి ఈ పథకం డబ్బులు వస్తాయి?:
ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందనున్నది. ఈ పథకం లబ్ధిదారులు ఎవరంటే
- ప్రభుత్వ స్కూల్లో మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులు
- అడిషనల్ క్వాలిఫికేషన్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు
- ఇంటర్ ప్రైవేట్ మరియు ప్రాజెక్టు విద్యార్థులకు అవకాశం.
లబ్ధిదారుల వివరాలు?:
- లబ్ధిదారుల సంఖ్య: 67 లక్షల మంది
- ఒక్కొక్కరికి మంజూరైన మొత్తం : ₹15,000/-
- మొత్తం విడుదల చేస్తున్న డబ్బులు: ₹8,745 కోట్లు
ఈ పథకం ద్వారా ప్రయోజనాలు :
- విద్యార్థుల డ్రాప్ అవుట్ రేటు తగ్గుతుంది
- తల్లుల ఆర్థిక భారం తగ్గుతుంది
- పిల్లల చదువులపై తల్లుల దృష్టి పెరుగుతుంది
- ఆ కుటుంబాల్లో చదువుపై అవగాహన ఇంకా పెరుగుతుంది
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో ఈ పథకాన్ని ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి పథకంగా అమలు చేస్తున్నారు. తల్లికి వందనం పథకం పేరిట విద్యకు మరింత బలాన్ని ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం.
Latest update:
ఈ డబ్బులు తల్లుల ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా june 12న పంపించమన్నారు.ఈ విషయాన్ని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించడం జరిగింది. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చిన వెంటనే ఆ లబ్ధిదారుని మొబైల్ నంబర్ కి ఎస్ఎంఎస్ కూడా వస్తుంది.
స్టేటస్ చెక్ ఎలా చేసుకోవాలి?:
అర్హులైన లబ్ధిదారుని తల్లి అకౌంట్లోకి డబ్బులు జమ అయిన వెంటనే ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ కూడా వస్తుంది. అలాగే ఏపీ స్టూడెంట్స్ డిబిటి హోటల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
- పథకం అమలు చేసే తేదీ : జూన్ 12, 2025
- ఫండ్స్ విడుదల చేసే తేదీ: జూన్ 12, 2025
- SMS నోటిఫికేషన్ : జూన్ 12 నుండి తల్లి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వస్తుంది
