AP Schools Reopen Date:
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యా సంవత్సరం 2025-26 కి సంబంధించి స్కూల్స్ రీఓపెన్ డేట్, హాలిడేస్, పుస్తకాల పంపిణీకి సంబంధించిన సమాచారం ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలను జూన్ 12వ తేదీ నుండి పునః ప్రారంభించనున్నారు. అదే తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ ప్రారంభం కానునట్లు విద్యాశాఖ సమాచారం అందించింది. వేసవి సెలవుల అనంతరం తిరిగి క్లాసులు ప్రారంభమవుతాయి.
పాఠ్యపుస్తకాల పంపిణీ:
ఈ ఏడాది కూడా విద్యాశాఖ పాఠశాలలు ప్రారంభించడానికి ముందే పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 80 శాతం పుస్తకాలు స్కూల్స్ కి చేరినట్లుగా అధికారులు తెలిపారు. మిగిలిన పుస్తకాల పంపిణీ జూన్ 10వ తేదీలోగా పూర్తవుతుందని తెలిసింది.
2025-26 విద్యా సంవత్సరం క్యాలెండర్:
జూన్ 12 నుండి ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం యొక్క క్యాలెండర్ ని ప్రభుత్వం విడుదల చేసింది.
తల్లికి వందనం పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది :Click Here
- ఫస్ట్ టర్మ్: జూన్ 12వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు
- దసరా సెలవులు: అక్టోబర్ 1 నుంచి 12వ తేదీ వరకు
- సెకండ్ టర్మ్ : అక్టోబర్ 13 నుండి డిసెంబర్ 23 వరకు
- క్రిస్మస్ హాలిడేస్ : డిసెంబర్ 24 నుండి 25 వరకు
- ఫైనల్ టర్మ్: జనవరి 2 నుంచి ఏప్రిల్ 23 వరకు
- ఏప్రిల్ 24, 2026 నుండి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు.
ముఖ్య సమాచారం:
- పాఠశాలలు పునః ప్రారంభమైన తర్వాత, ప్రతిరోజు తరగతులను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు
- సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు తరగతులు జరుగుతాయి
- ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమవుతుంది
- ప్రతిరోజు కొంత సమయం డిజిటల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది
తల్లిదండ్రులు, విద్యార్థులకు ముఖ్య సూచనలు:
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో త్వరలో పునః ప్రారంభం కానున్నటువంటి సందర్భంలో విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా పిల్లలను స్కూల్స్ కి రెడీ చేసి పంపించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే రెడీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
