AP EAMCET 2025 విద్యార్థులకు Alert: ఇంటర్ మార్కుల డిక్లరేషన్ ఫారం ప్రతి ఒక్కరు సవరించుకోవాలి: లేదంటే 25% వెయిటేజ్ రాదు.

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 రాత పరీక్ష రాసిన ఇంటర్ విద్యార్థులకు ఏపీ సెట్ కన్వీనర్ అయినటువంటి వి.వి.సుబ్బారావు ముఖ్యమైన విషయం తెలిపారు. విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను ఎంసెట్ డిక్లరేషన్ ఫారం లో కరెక్ట్ గా ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని సవరించుకోవడానికి జూన్ 5వ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది. ఇంటర్ మార్కులను డిక్లరేషన్ ఫారం లో ఇవ్వని విద్యార్థులకు 25% వెయిటేజ్ మార్కులు కలవవు. ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులకు 25% వెయిటేజ్ మార్కులు రావాలి అంటే ఇంటర్లో వచ్చిన మార్కులు తప్పనిసరి. కావున జూన్ 5వ తేదీలోగా విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను డిక్లరేషన్ ఫారంలో మరొకసారి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని సవరించుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

  • లేటెస్ట్ అప్డేట్: ఇంటర్ విద్యార్థులు వారి యొక్క మార్కులను ఎంసెట్ వెబ్సైట్లోనే డిక్లరేషన్ ఫారం లో సవరించుకోవడానికి జూన్ 5వ తేదీ వరకు సమయం ఇచ్చారు.

Join Whats App Group

సవరణ ఎందుకు చేయాలి?:

  • కొంతమంది ఇంటర్ విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను తప్పుగా ఎంటర్ చేయడం వల్ల వారి యొక్క ర్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
  • డిక్లరేషన్ ఫారం లో సరిచేయకుండా ఉంచిన తప్పులు ఎంసెట్ ర్యాంకులు విడుదల చేసే సమయంలో సమస్యలను కలిగించే అవకాశం ఉంది

మార్కుల సవరణకు ఆఖరి తేదీ?:

ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కులను సవరించుకోవడానికి జూన్ 5వ తేదీ వరకు సమయం ఇవ్వడం జరిగింది.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల: అఫీషియల్ డేట్

  • సవరణకు ఆఖరి తేదీ : జూన్ 5, 2025
  • విద్యార్థులు వారు అధికారిక ఎంసెట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమ యొక్క ఇంటర్మీడియట్ గ్రేడ్ మార్కుల వివరాలను సవరించుకోవాలి.
  • సబ్జెక్టుల వారిగా ఉన్న మార్కులను చెక్ చేసుకోవాలి
  • అన్ని సబ్జెక్టుల యొక్క మార్కుల వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఏమైనా సవరణలు అవసరమైతే చేసి సబ్మిట్ చేయాలి

తెలంగాణ విద్యార్థులు కూడా సవరణ చేయాలా?:

తెలంగాణ విద్యార్థులతో పాటు CBSE, ICSE, NIOS, Apcos బోర్డుల వారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షలు రాసినట్లయితే వారి యొక్క ఇంటర్ మార్కులను జూన్ 5వ తేదీలోగా సవరణ చేసుకోవాలి.

అధికారిక వెబ్సైట్ లింక్:

https://cets.apsche.ap.gov.in ఈ వెబ్సైట్లో ముందుగా లాగిన్ అయ్యి మార్కులు చెక్ చేసుకుని సవరణ చేసుకోవాలి. సర్వర్ డోన్ అయ్యే అవకాశాలు ఉన్నందున త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.

Declaration Form Edit Website Link

ముఖ్యమైన గమనిక:

  • ఇంటర్ మార్కులను సవరించిన డేటా ఆధారంగా మీ యొక్క ర్యాంక్ జనరేట్ అవుతుంది
  • 25 శాతం ఇంటర్ వెయిట్ మార్కులు కలుస్తున్నందున ఎటువంటి తప్పులు లేకుండా డేటాలో మీ యొక్క ఇంటర్ మార్కులను సవరణ చేయాలి
  • ఇంటర్ మార్కుల సవరణ చేసిన తర్వాత మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ ని మరొకసారి సబ్మిట్ చేయాలి

ఇంటర్ మార్కుల డేటాలో చిన్న తప్పు కూడా మీ యొక్క ర్యాంకు పై పెద్ద ప్రభావం చూపించవచ్చు. కావున విద్యార్థులు జూన్ 5వ తేదీలోగా డిక్లరేషన్ ఫారంలోని ఇంటర్ మార్కులను సరి చూసుకోగలరు.