AP Inter Supplementary Exams 2025 Results Date: Download Results @bie.ap.gov.in/

AP Inter Supplementary Exams 2025:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పరీక్షలు పూర్తయి రెండు వారాలు కావస్తోంది, కానీ ఫలితాలకు సంబంధించి అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మరో వారం రోజుల్లో విడుదల చేయనున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, నీట్ యూజీ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వాట్సాప్ లో కూడా చూసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ: official update :

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత్ పరీక్షను మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలను మరో వారం రోజుల్లోగా అనగా మే 10వ తేదీ నాటికి ఫలితాలు విడుదల చేయమన్నారు. దీనికి సంబంధించి అధికారులు పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసి, విద్యార్థుల యొక్క మార్పులు డేటాను ప్రిపేర్ చేసి, వాట్సాప్ ద్వారా మరియు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Join Whats App Group

ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ 2025 పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు వెబ్సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేయండి.
  2. AP Inter supplementary exams 2025 results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.
  5. ఆ మార్క్స్ మెమో ప్రింట్ అవుట్ తీసుకోండి

వాట్సాప్ ద్వారా ఫలితాలు ఎలా చూసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్ని పోటీ పరీక్షలు మరియు academic మీకు పరీక్షలకు సంబంధించిన ఫలితాలను చూసుకునే విధంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను కూడా వాట్సాప్ ద్వారా చూసుకోవచ్చు.

ఏపీలో తల్లికి వందనంలాగానే మహిళలకు మరో పధకం: Click Here

  • ముందుగా విద్యార్థి యొక్క వాట్సాప్ లో +9195523 00009 నంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి.
  • సేవలను ఎంచుకోండి అనే ఆప్షన్పై క్లిక్ చేయండి
  • ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని సర్చ్ చేసి ఎంపిక చేయండి.
  • AP Inter Supplementary Results” ఆప్షన్ పే క్లిక్ చేయండి
  • విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • వెంటనే ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి. ప్రింట్ అవుట్ తీసుకోండి.

APBIE Website: Results

ఫలితాలు చూసుకున్న తర్వాత మీ యొక్క ఫలితాల్లో మీరు ఉత్తీర్ణత సాధించారా లేదా అనేటువంటి విషయాన్ని క్రింది కామెంట్ సెక్షన్లో తెలుపగలరు.