AP EAMCET 2025 Exam:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు ముగిశాయి. షిఫ్టుల వారిగా జరిగిన ఈ పరీక్షల్లో కొన్ని శక్తుల విద్యార్థులకు ప్రశ్నపత్రం చాలా కఠినంగా వచ్చింది, కొన్ని సూక్తులు రాసిన విద్యార్థులకు ప్రశ్న పత్రం కొంచెం సులభతరంగా ఉంది. ఇలా శెట్టి వారిగా పరీక్షలో జరిగినప్పుడు విద్యార్థులందరికీ సమానమైన మార్కులు వచ్చే విధంగా నార్మలైజేషన్ అనేటువంటి విధానాన్ని ఉన్నత విద్యాశాఖ అనుసరించడం జరుగుతుంది. అయితే బాగా కఠినంగా వచ్చినటువంటి శక్తుల వారికి ఈసారి 6 నుండి 16 మార్కులు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 2024 లో కూడా 8 నుండి 15 మార్కులు కలిసినట్లు విద్యార్థులు చెప్పారు. దీనివల్ల చాలామంది విద్యార్థులకు ర్యాంకులు మెరుగు అవడం జరిగింది.
నార్మలైజేషన్ అంటే ఏంటి?:
షిఫ్టుల వారీగా జరిగిన పరీక్షల్లో, కొన్ని పరీక్షల్లో ప్రశ్నాపత్రం కఠినంగా ఉంటుంది. మరి కొన్ని పరీక్షల్లో ప్రశ్న పత్రం చాలా సులభంగా ఉంటుంది. అయితే సులభంగా వచ్చిన వారి మార్కులు కఠినంగా వచ్చిన వారి మార్కులు సమానంగా ఉండే విధంగా చేయడానికి నార్మలైజేషన్ విధానాన్ని అనుసరిస్తారు. దీని ద్వారా అందరికీ సమానమైనటువంటి మార్కులు రావడంతో పాటు అందరికీ న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరించడం జరుగుతుంది.
నార్మలైజేషన్ ఫార్ములా:
జేఎన్టీయూ యూనివర్సిటీ ప్రకారం నార్మలైజేషన్ ఫార్ములా క్రింది విధంగా ఉంటుంది.
- Normalized Marks = (GMS – MGS) / (TopAvg – MGS) × (Candidate Marks – MGS) + GMS
పైన ఉన్న ఫార్ములా ప్రకారం ప్రశ్న పత్రం కఠినంగా వచ్చిన వారికి మరియు సులభంగా వచ్చిన వారికి సమానమైన మార్కులు వచ్చే విధంగా చేస్తారు.
6 నుండి 16 మార్కులు ఎలా కలుస్తాయి?. ఇది సాధ్యమేనా?:
అవును ఇది సాధ్యమే. కొన్ని షిఫ్టుల్లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నా మీరు మంచి మార్కులు సాధించినట్లయితే మీకు 6 నుండి 16 మార్కులు కలిసి అవకాశం 100% ఉంది. ఇలా గత సంవత్సరాల్లో కూడా జరిగింది కాబట్టి ఈసారి కూడా మార్కులు ఎక్కువగానే కలుస్తాయి.
ఏపీ ఎంసెట్ 2025 విద్యార్థులు ఇంటర్ మార్కులను వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి- లేదంటే ర్యాంక్ రాదు
ఉదాహరణకి:
- మీకు 42 మార్కులు వచ్చాయి అనుకుందాం. మీరు రాసిన షిఫ్ట్ లో ఇతరులు తక్కువ స్టోర్ చేయగా మీరు కాంపిటీటివ్ స్కోర్ చేసినట్లయితే
- Normalisation marks : 56 లేదా 58 అవ్వొచ్చు.
2024 లో ఎన్ని మార్కులు కలిపారు?:
2024లో కూడా కఠినమైన షిఫ్ట్ లో ప్రశ్నలు వచ్చినటువంటి విద్యార్థులకు 8 నుండి 15 మార్కులు అదనంగా కలపడం జరిగింది. ఇది నార్మలైజేషన్ విధానం అనుసరించిన తర్వాత ఈ విధంగా మార్కులు కలిపారు. దీనివల్ల చాలామంది విద్యార్థులు యొక్క మార్కులు మెరుగయ్యాయి అలాగే ర్యాంకు కూడా మెరుగు కావడం జరిగింది.
మీకు ఎంత నార్మలైజేషన్ మార్కులు వచ్చాయో ఎలా తెలుసుకోవాలి?:
మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డులో Raw marks మరియు normalized marks చూడవచ్చు. ఆ వివరాలను ఆధారంగా చేసుకొని మీరు అంచనా వేయవచ్చు
అయితే అందరికీ ఒకేలా మార్పులు పెరగవు. పరీక్ష పత్రం కఠినంగా వచ్చినటువంటి వారికి మాత్రమే ఈ విధంగా మార్పులు కలుస్తాయి.
ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి వారికి తెలుస్తుంది.
