RRB NTPC 2025 Exams:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (RRB NTPC 2025) కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ మరియు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ యాక్టివేట్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 27,2025 తేదీ నుండి ఎగ్జామ్స్ సెంటర్ మరియు అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 5వ తేదీ నుండి జూన్ 24వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 100 మార్కులకు సంబంధించి తెలుగు మరియు ఇతర భాషల్లో 90 నిమిషాల పాటు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. రేపటి నుండి అనగా మే 27వ తేదీ నుండి మీకు ఏ రోజున ఏ సెంటర్లో ప్రాతపరీక్ష జరుగుతుందో తెలుసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఈ రైల్వే ఎన్టిపిసి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. సిటీ ఇంటిమేషన్ స్లిప్ మరియు అడ్మిట్ కార్డ్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
రైల్వే NTPC 2025 సిటీ ఇంటిమేషన్స్ స్లిప్, అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
రైల్వే ఎన్ టి పి సి 2025 గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ లకి దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా సిటీ ఇంటిమేషన్ స్లిప్ మరియు అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ (RRB NTPC 2025 City Slip) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో “RRB NTPC 2025 City intimation slip ” ఆప్షన్పై క్లిక్ చేయండి
- అప్పుడు లాగిన్ పేజ్ లోనికి రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది.
- లాగిన్ పేజ్ లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ లేదా డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- లాగిన్ అయిన వెంటనే స్క్రీన్ మీద మీ యొక్క సిటీ ఇంటిమేషన్ మరియు ఎగ్జామ్స్ సెంటర్ వివరాలు కనిపిస్తాయి.
- వెంటనే అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
RRB NTPC 2025: City Intimation Slip Link
రైల్వే NTPC 2025 పరీక్ష తేదీలు:
రైల్వే ఎన్ టి పి సి 2025 పరీక్షలను జూన్ 5వ తేదీ నుండి జూన్ 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇవి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు రోజుకి మూడు నుంచి నాలుగు షిఫ్ట్ లు వారీగాపరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
RRB NTPC పరీక్ష విధానం:
రైల్వే ఎన్టిపిసి రాత పరీక్ష మొత్తం వంద మార్కులకు నిర్వహిస్తారు. ఏ సెక్షన్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయో ఈ క్రింది వివరాల ద్వారా తెలుసుకోండి.
- మ్యాథమెటిక్స్: 30 ప్రశ్నలు – 30 మార్కులు
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ : 30 ప్రశ్నలు – 30 మార్కులు
- జనరల్ అవేర్నెస్ : 40 ప్రశ్నలు – 40 మార్కులు
ప్రాతపరీక్ష తెలుగు హిందీ ఇంగ్లీష్ తో పాటు ఇతర రీజినల్ భాషల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. తప్పుగా సమాధానం ఇచ్చిన ప్రశ్నలకు 1/3rd నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి.
కావున ప్రాతపరీక్ష రాసే అభ్యర్థులు చాలా జాగ్రత్తగా నెగటివ్ మార్కులు రాకుండా మీకు తెలిసినటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాసినట్లయితే కరెక్టుగా సమాధానం చెప్పిన మార్కుల నుంచి మీరు కోల్పోయే అవకాశం ఏమీ ఉండదు.
