AP Intermediate 1st Year & 2nd Year Supplementary Results 2025:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ సప్లమెంటరీ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం మీకు తెలిసిందే. అయితే ఈ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఒక శుభవార్త. ఈ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఈ ఫలితాలు ఎంతో కీలకం. ఇంటర్ ఫస్టియర్ సబ్జెక్టులో మార్కులను మెరుగుపరచుకోవడానికి కొంతమంది మరి కొంతమంది ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు పాస్ అవ్వడానికి ఈ పరీక్షలు రాశారు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఈ ఫలితాలు విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఈ పరీక్షల్లో పాస్ అయ్యి డిగ్రీ అడ్మిషన్స్ పొందాలని కొంతమంది మరి కొంతమంది ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ అవ్వాలని మరి కొంతమంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాత్రం ఈ ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫలితాలు విడుదలైన వెంటనే మీరు పూర్తి సమాచారం తెలుసుకొని వెంటనే ఫలితాలు చూసుకోవడానికి మా వెబ్సైట్ ని విజిట్ చేయండి.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరీక్ష పత్రాలు మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు త్వరితగతిన పేపర్స్ కరెక్షన్ పూర్తి చేసి రిజల్ట్స్ విడుదల చేయాలని భావిస్తున్నారు.
వాట్సాప్ లో ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోండి.
- ముందుగా ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ నంబర్ +9195523 00009 కు ‘HI’ అని మెసేజ్ చేయండి.
- సెలెక్ట్ సర్వీసెస్ ఆప్షన్పై క్లిక్ చేయండి
- ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి
- అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్ష ఫలితాలు ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేసి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.
- మాక్స్ మేము డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
వాట్సాప్ ద్వారా గాని కాకుండా మీరు అధికారికి వెబ్సైట్ నుండి కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
https://bie.ap.gov.in/ వెబ్సైట్ హోమ్ పేజీలో ‘ AP intermediate 1st year and 2nd year supplementary exams 2025 results ‘ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేసినట్లయితే వెంటనే మీయొక్క ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు.
FAQ’s:
1. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల ఎప్పుడు?
జూన్ మొదటి వారంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు.
