AP Ration Cards 2025:
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు కూడా లేనటువంటి ప్రజల కోసం వాట్సాప్ లోనే కొత్త రేషన్ కార్డు పొందే విధంగా గొప్ప సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి మనమిత్ర అనేటువంటి సౌకర్యం ద్వారా వాట్సాప్ లోనే చాలా ప్రభుత్వ సేవలను పొందే విధంగా ప్రజల కోసం ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ని కూడా అప్లై చేసుకుని వాట్సాప్ ద్వారానే పొందే విధంగా మరొక సౌకర్యం తీసుకురావడం జరిగింది. మొత్తం ఎనిమిది రకాల ప్రభుత్వ సేవలను మీరు వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. అయితే ఇప్పుడు అసలు రేషన్ కార్డు కూడా లేనటువంటి వారు కొత్తగా రేషన్ కార్డు ని వాట్సాప్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకొని ఏ విధంగా పొందాలి అనేటువంటి పూర్తి సమాచారం చూద్దాం.
కొత్త రేషన్ కార్డుకు అర్హత ఉన్నవారు ఈ విధంగా పొందవచ్చు :
ముందుగా మీ మొబైల్ ఫోన్ నుండి 9552300009 నంబర్ కు HI హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు ప్రభుత్వ సేవలు ఏమి పొందాలనుకుంటున్నారో ఆ సేవ పైన క్లిక్ చేసే విధంగా సేవను పొందండి అనే ఆప్షన్ చూపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి.
ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- దీపం ఫిల్టర్
- రైస్ డ్రా స్టేటస్
- రైస్ ఈవెంట్స్ ఫిల్టర్
- రేషన్ కార్డ్ సమర్పణ
- రేషన్ కార్డ్ డౌన్లోడ్
- సివిల్ సప్లై సేవలు
- ఆధార్ సీడింగ్
- కార్డు వివరాలు తెలియజేయడం
వీటితోపాటు మొత్తం ఎనిమిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
కొత్త రేషన్ కార్డు, eKYC కోసం దరఖాస్తు ఇలా చేయండి:
రేషన్ కార్డు సంబంధిత కొత్త దరఖాస్తులు, ఈ కేవైసీ సేవలు ఆధార్ లింకింగ్ కార్డు స్టేటస్ చెకింగ్ వంటి అవసరాల కోసం ఈ వాట్సాప్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బులు, ఇలా అన్నీ కూడా సేవ అయ్యే అవకాశం ఉంది.
Apply Process:
- వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత
- సివిల్ సప్లైస్ అనే సేవను ఎంచుకోవాలి
- మీకు సేవలో సివిల్ సప్లై ఆప్షన్ చూపించకపోతే ” మీ వాట్సాప్ ని ప్లే స్టోర్ నుండి అప్డేట్ చేసుకోండి “
- సివిల్ సప్లై సేవను సెలెక్ట్ చేసుకున్నాక, మీకు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ చూపిస్తుంది
- దాని పైన క్లిక్ చేసి మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేయండి.
వాట్సాప్ డైరెక్ట్ లింక్ / నెంబర్:
+9195523 00009 వాట్సాప్ నెంబర్ కు ఇప్పుడే మెసేజ్ చేసి మీకు కావాల్సినటువంటి సేవలు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోండి.
లాభాలు:
గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా ఈ సేవలను సులభంగా పొందవచ్చు.రేషన్ పథకాల్లో పారదర్శకత, దుర్వినియోగం తగ్గింపు, యూజర్ ఫ్రెండ్లీ వంటి చాలా రకాల లాభాలు ఈ సేవలు వల్ల ఉన్నాయి
ముఖ్యమైన లింక్స్:
AP Civil Supplies Official Website
Apply New Ration Card (AP Meeseva)
ఇప్పుడు మీకు కావాల్సిన రేషన్ సేవలు అన్ని కూడా ఒక్క మెసేజ్ దూరంలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఈ నూతన సదుపాయాన్ని ప్రతి ఇంటిలోని వారు ఉపయోగించుకోండి. పైన తెలిపిన వాట్సాప్ నెంబర్ కు ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి.
