AP Schools Reopen Date:
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చిన సమ్మర్ హాలిడేస్ త్వరలో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనే దానిపై విద్యార్థుల్లో సందేహం నెలకొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోని సమ్మర్ హాలిడేస్ పూర్తయిన తర్వాత జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభమవుతాయని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి విద్యార్థులు ఎటువంటి సందేహం లేకుండా జూన్ 12వ తేదీ 2025 నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేటువంటి విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాలని విద్యాశాఖ తెలిపింది. స్కూల్స్ ప్రారంభమయ్యే తేదీల విషయంలో ఎటువంటి మార్పులు లేవని, గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీనే పునః ప్రారంభమవుతాయని తెలిపారు.
స్కూల్స్ ఓపెన్ చేసే రోజునే పుస్తకాలు :
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ చేసే రోజునే పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.
- 1.64 కోట్ల పుస్తకాల్లో ఇప్పటికే 1.24 కోట్ల పుస్తకాలు జిల్లా గోదాములకు చేరాయని అధికారులు స్పష్టం చేశారు.
- వాటిలో 1.22 కోట్ల పుస్తకంలో మండల కేంద్రాలకు పంపిణీ చేశారని తెలిపారు.
- మిగిలిన పుస్తకాలను స్కూల్స్ ప్రారంభానికి ముందు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరం ముఖ్యాంశాలు:
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా సంవత్సరం 2025- 26 కి సంబంధించి ముఖ్యమైన తేదీలు క్రింది విధంగా ఉన్నాయి.
తెలంగాణలో స్కూల్ రీఓపెన్ డేట్ ఇదే : వివరాలు చూడండి
| అంశము | వివరాలు |
| పాఠశాలల ప్రారంభ తేదీ | జూన్ 12, 2025 |
| వేసవి సెలవుల ముగింపు తేదీ | జూన్ 11, 2025 |
| తరగతి సమయం | ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు |
| పని దినాలు | సోమవారం నుండి శనివారం వరకు |
| వారాంతపు సెలవులు | ఆదివారం |
| ప్రధాన సెలవులు | దసరా, సంక్రాంతి, ఉగాది, క్రిస్మస్ మొదలైన పండుగల సెలవులు |
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:
- కొత్త క్లాసులు ప్రారంభమయ్యే నాటికి అన్ని స్టేషనరీ వస్తువులను సిద్ధం చేసుకోవాలి.
- స్కూల్లో పుస్తకాలు అందించిన వెంటనే వాటికి మంచిగా కవర్స్ వేసి భద్రపరచుకోవాలి
- పాఠశాల టైమింగ్స్ మరియు యూనిఫామ్ వివరాలను ముందుగానే తెలుసుకొని దానికి అనుగుణంగా రెడీ అవ్వాలి.
తల్లిదండ్రులకు సూచనలు:
- తల్లిదండ్రులు స్కూల్స్ ప్రారంభమైన తర్వాత పిల్లలు కచ్చితంగా పాఠశాలకు వెళ్లి తరగతులకు హాజరయ్యే విధంగా శ్రద్ధ తీసుకోవాలి
- పాఠశాలలకు వెళ్లడానికి కావలసిన లంచ్ బాక్స్, ట్రావెల్స్ సదుపాయం ముందుగానే చూసుకోవాలి
- పిల్లల యొక్క ఆరోగ్యం మరియు భద్రతపై పూర్తి శ్రద్ధ వహించండి.
2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్స్ జూన్ 12వ తేదీ నుండి పునః ప్రారంభం కానున్నాయి. దీనికి అనుగుణంగా పిల్లలు తల్లిదండ్రులు సిద్ధం కావాలని ప్రభుత్వం కోరుతోంది.
