TS EAMCET 2025:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఇటీవల ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జేఎన్టీయూ నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3,05,000+ మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 29 నుండి మే నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఫైనల్ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మొదటి ర్యాంకు నుండి ఆఫర్ ర్యాంక్ కొరకు ర్యాంకులను కేటాయించడం జరిగింది. త్వరలో వెబ్ కౌన్సెలింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి వెబ్ ఆప్షన్స్ తీసుకొని అన్నారు. ముందుగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత జోస కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ర్యాంకులు వచ్చిన విద్యార్థులు మీకు ఎంత ఎక్కువ ర్యాంకు వచ్చినా తక్కువ ర్యాంకు వచ్చినా మీకు తెలంగాణలోని ఏ జిల్లాలో ఏ బ్రాంచ్ వస్తుందో mock కౌన్సిలింగ్ ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఎంసెట్ 2025 Rank vs College vs Branch:
తెలంగాణ తెలంగాణ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థుల్లో చాలామందికి చాలా ఎక్కువ ర్యాంకులు రావడం జరిగింది. అయితే వారికి ఏ కాలేజీలో వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ సీటు వస్తుందని ఆందోళనతో ఉన్నారు. అలాంటి విద్యార్థులు ఆందోళన పడకుండా మీరు ఇప్పుడే ఈ మోక్ కౌన్సిలింగ్ ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు. ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీకు ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో ఇప్పుడే చూసుకోండి.

- ముందుగా ఈ (Mock Counselling Website) వెబ్సైట్ ఓపెన్ చేయండి
- అందులో మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేసి, మీ జెండర్, మీ యొక్క కేటగిరి, మీ జిల్లా మరియు రాష్ట్రం, ఇతర వివరాలన్నీ సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో ఏ బ్రాంచ్ వస్తుందో ఒక లిస్ట్ అంతా మీకు కనిపిస్తుంది.
- ఆ టేబుల్ ని బట్టి మీ ర్యాంకును బట్టి ఏ కాలేజీలో మీకు ఏ బ్రాంచ్ సీటు వస్తుందో తెలుసుకోండి.
ఈ విధంగా తెలుసుకోవడం ద్వారా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఏ కాలేజీలో మీకు వచ్చినటువంటి ర్యాంక్ ని బట్టి మీకు ఏ బ్రాంచ్ వస్తుందో ముందుగానే తెలుసుకొని దానికి అనుగుణంగా మీ యొక్క మెదడుని నిమ్మలపరుచుకోవచ్చు.
FAQ’s:
1. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
ముందుగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కౌన్సెలింగ్ మొదలవుతుంది దాని యొక్క నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నిర్వహిస్తారు.