AP DSC 2025:
ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ ప్రభుత్వం 16,347 పోస్టులతో అధికారికంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే ఈ పోస్టులకి సంబంధించి నిన్నటితో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. డీఎస్సీ పోటీ పరీక్షలకు 3,58,599 మంది అభ్యర్థులు 5,67,000 దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఆరో తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ లేదా హాల్ టికెట్స్ ని ఎప్పటినుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ అధికారులను సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. అయితే ఈ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి మరి కొంత సమయం కావాలని మరో రెండు నెలల వరకు ఈ పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇంత తక్కువ సమయంలో పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చాలా సిలబస్ ఉందని కావున కచ్చితంగా ఈ పరీక్షను మరికొద్ది రోజులు పొడిగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది డిఎస్సీ అభ్యర్థులు నేషనల్ హైవేస్ పైన బయటయించి నిరసనలు తెలియజేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం స్పందించి ఈ డీఎస్సీ పరీక్షను పోస్ట్ పోన్ చేయొచ్చేమోనని అభ్యర్థులు భావిస్తున్నారు.
AP డీఎస్సీ హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?:
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లోనే వారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి మే 30వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.in నందు హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఆక్టివేట్ చేయడం జరుగుతుంది.
ఏపీ డీఎస్సీ మొత్తం ఎన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చాయి?:
ఏపీ మెగా డీఎస్సీ ఉద్యోగాలకు ఏప్రిల్ 25 నుండి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఏపీ మెగాడీఎస్సీ 16,347 ఉద్యోగాలకు మొత్తం 353,598 అభ్యర్థులు 5,67,000+ దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు రోజుకి రెండు షిఫ్ట్ లవారిగా జరగనున్నాయి.
How to download AP DSC admit cards :
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అభ్యర్థులు ముందుగా ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” AP DSC 2025 download admit cards ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పే క్లిక్ చేయండి
- వెంటనే వారి యొక్క అడ్మిట్ కార్డ్స్ లేదా హాల్ టికెట్స్ స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతాయి
- డౌన్లోడ్ అయిన అడ్మిట్ కార్డు ని ప్రింట్ అవుట్ తీసుకొని అందులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పరీక్షకు అవసరం అండి
AP DSC 2025 : Official Website
FAQ’s:
1. ఏపీ డీఎస్సీ 2025 అడ్మిట్ కార్డ్స్ లేదా హాల్ టికెట్స్ ఎప్పటినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి?
మే నెల 30వ తేదీ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ యాక్టివేట్ చేస్తారు
2. ఏపీ డీఎస్సీ 2025 ఉద్యోగాలకు మొత్తం ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు?
డీఎస్సీ ఉద్యోగాలకు 3,58,568 మంది అభ్యర్థులు 5,67,000 దరఖాస్తు చేసుకోవడం జరిగింది
3. ఏపీ డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు?
జూన్ ఆరో తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు ప్రతిరోజు రెండు షిఫ్టులవారీగా డీఎస్సీ పరీక్షలు కంప్యూటర్ లో నిర్వహిస్తారు
