What’s App Will Not Work on These Mobiles:
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరి మొబైల్ లో మెసేజింగ్ యాప్ వాట్సప్ కచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సాప్ మాత్రమే. అయితే వాట్సాప్ తన సాఫ్ట్వేర్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ పాత మోడల్ మొబైల్ ఫోన్లకు ప్రాధాన్యలు తగ్గిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత మోడల్ ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు ఐఓఎస్ ఫోన్ లలో వాట్సప్ పనిచేయదు అని ప్రకటించింది. మరి మీ మొబైల్ లో వాట్సాప్ పని చేస్తుందా లేదా అనేది ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
వాట్సాప్ పని చేయని ఫోన్లు ఇవే :
వాట్సాప్ తన యొక్క సిస్టం అప్డేట్స్ కారణంగా పాత మోడల్స్ మొబైల్స్ లోని పాత ఆపరేటింగ్ సిస్టం ఉన్న డివైస్లలో మద్దతు ఇవ్వడం నిలిపివేస్తుంది. ఇకపై ఈ క్రింది డివైస్లలో వాట్సాప్ అనేది పనిచేయదు.
Android ఫోన్లు:
- Android 5.0 (Lollipop) కంటే పాత వర్షం ఉన్న ఫోన్లు
- ఉదాహరణకి: Samsung Galaxy S5, Sony Xperia Z2, HTC One M8
ఐఫోన్స్:
- ఐఫోన్ 12 కంటే పాత వర్షం ఉన్న మొబైల్స్
- ఉదాహరణకి : IPhone 5,IPhone 5c
వాట్సాప్ పని చేయకపోవడానికి కారణాలు ఏమిటి?:
ప్రస్తుతం వాట్సాప్ కొత్త టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్ ఫీచర్లను అభివృద్ధి చేస్తుంది. పాత మోడల్ ఫోన్లలో ఈ కొత్త ఫీచర్లు సపోర్ట్ చేయనందున, వాట్సాప్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Jio ₹26/- తో రీఛార్జ్ చేస్తే 30 రోజులు నాన్ స్టాప్ బెనిఫిట్స్
మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి:
ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ మోడల్స్ లో వాట్సాప్ పని చేస్తుందా లేదా అనేది ఇక్కడ ఉండే విధంగా చెక్ చేసుకోవాలి
Android మొబైల్స్ లో:
- Settings > About Phone > Software Information లో ఆండ్రాయిడ్ వర్షన్ చూడండి
iPhone లో:
- Settings > General > About > iOS version చూడండి.
మీరు చేయవలసిన పని ఏమిటి?:
- మీ మొబైల్ ఫోన్ వాట్సాప్ కి సపోర్ట్ చేస్తున్నట్లయితే మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు
- ఒకవేళ పాత మోడల్ ఫోన్ వాడుతున్నట్లయితే కొత్త మోడల్ మొబైల్ ఫోన్ కి మారండి లేదా పాత ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి ( అది కూడా అవకాశం ఉంటే )
వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పులు చాలామంది పాత మోడల్ ఫోన్ వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీరు వాట్సాప్ వినియోగించాలి అంటే మీ పాత వర్షన్ మొబైల్ ఫోన్ ని ఇప్పుడే చెక్ చేసుకోండి.
