APCOS Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APCOS ద్వారా విశాఖపట్నంలోని జి.ఎస్.టి ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నందు పనిచేయడానికి అవుట్సోర్సింగ్ విధానంలో ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను బట్టి చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేయడం జరిగింది. అర్హతలు మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు మే 3వ తేదీ 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
APCOS Jobs 2025 : ఖాళీల వివరాలు:
ఉద్యోగ కార్యాల వివరాలు కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
| ఉద్యోగం పేరు | మొత్తం ఖాళీలు | అర్హతలు | వయోపరిమితి | జీతం వివరాలు |
| డేటా ఎంట్రీ ఆపరేటర్ | 07 | ఏదైనా డిగ్రీ | 18-42 | ₹18,500/- |
| ఆఫీసు సబార్డినేట్ | 05 | 7వ తరగతి | 18-42 | ₹15,000/- |
అర్హతల వివరాలు(Eligibility Criteria):
- డేటా ఎంట్రీ ఆపరేటర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నందు డిప్లమా లేదా పీజీ డిప్లమా వృత్తిని లేనటువంటి వారు అర్హులు. అలాగే సంబంధిత రంగంలో పని అనుభవం కలిగినటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
- ఆఫీస్ సవార్డినేట్ : ఏడవ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు.
- ఎంత వయస్సు ఉండాలి : 01-04-2025 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసే విధానం (How To Apply):
- అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల నకళ్ళను జత పరిచి, తమ దరఖాస్తులను అదనపు కమీషనర్, ప్రాంతీయ GST మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, VMRDA భవనం, సిరిపురం, విశాఖపట్నం నందు గడువులోగా సబ్మిట్ చేయవలెను.
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 21-04-2025
- దరఖాస్తు ఆఖరు తేదీ : 03-05-2025
ధ్రువ పత్రాల వివరాలు:
- అర్హతల ధ్రువ పత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రము
- రేషన్ కార్డు, ఆధార్ కార్డు
- పని అనుభవం ఉన్న ధ్రువ పత్రాలు
- ఇతర సర్టిఫికెట్స్
ఎంపిక విధానం:
- ఈ రిక్రూట్మెంట్ పూర్తి పారదర్శకంగా, మెరిట్ మార్కులు, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా చేయడం జరుగుతుంది.
- కావున అభ్యర్థులు ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండవలెను.
శాలరీ వివరాలు:
APCOS విశాఖపట్నం జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఈ క్రింది విధంగా జీతాలు ఉంటాయి.
రేపు TS 10th రిజల్ట్స్ విడుదల: Check
- డేటా ఎంట్రీ ఆపరేటర్ : ₹18,500/- జీతం ఉంటుంది.
- ఆఫీస్ సబార్డినేట్ : ₹15,000/- జీతం ఉంటుంది.
దరఖాస్తు ఆఖరు తేదీ(Last Date):
ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ లాస్ట్ డేట్ : 3rd మే, 2025.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడినటువంటి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
FAQ’s:
1.APCOS ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి?
సమాధానం: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ సర్టిఫికెట్స్ ఉండాలి. ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ఏడవ తరగతి అర్హత ఉండాలి.
2. APCOS ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తారా?
సమాధానం: ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు టెంపరరీ మాత్రమే వీటిని పర్మినెంట్ చేసే అవకాశం లేదు
3. దరఖాస్తు ఆఖరి తేదీ ఏమిటి?
సమాధానం: 3rd మే, 2025 తేదీలోగా అప్లై చేయాలి.
