AP RGUKT IIIT Admissions 2025-26:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నందు (AP RGUKT IIIT Admissions 2025-26) ఆరు సంవత్సరాల బిటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కొరకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ అడ్మిషన్ నోటీసు విడుదల చేశారు. ఏపీలోని నూజివీడు , ఆర్కే వ్యాలీ ( ఇడుపులపాయ), ఒంగోలు మరియు శ్రీకాకుళం క్యాంపస్లలో ప్రవేశాలకు అర్హులైన పదో తరగతి పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
RGUKT అడ్మిషన్స్ పూర్తి వివరాలు :
ఆర్జీయూకేటీ ఐఐఐటి అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థులు ఈ క్రింది వివరాలు చూడగలరు.
| అడ్మిషన్స్ నోటీస్ ఇచ్చిన సంస్థ | రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ , ఆంధ్ర ప్రదేశ్ | 
| కోర్స్ వివరాలు | ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ ప్రోగ్రాం | 
| మొత్తం ఎన్ని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లు | ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు, ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ | 
| ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 27th ఏప్రిల్ 2025 | 
| ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ | 20th మే 2025 | 
| RGUKT అధికారిక వెబ్సైట్ | www.rgukt.in | 
అర్హతలు వివరాలు:
- 2024-25 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ వాసై ఉండాలి.
- పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు అడ్మిషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది.
అప్లై చేసే విధానం:
- ముందుగా అధికారిక వెబ్సైట్ www.rgukt.in ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ‘Admissions 2025’ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ‘New Registration’ పై క్లిక్ చేయండి.
- టెన్త్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి, నోటిఫికేషన్ తెలిపిన ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
అడ్మిషన్ నోటీస్ విడుదల తేదీ : 24th ఏప్రిల్ 2025
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27th ఏప్రిల్ 2025
దరఖాస్తు ఆఖరి తేదీ : 20th మే 2025
పైన తెలిపినటువంటి తేదీలలోగా పదో తరగతి ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడినటువంటి అధికారిక వెబ్సైట్ లింక్స్ ద్వారా అడ్మిషన్స్ కొరకు దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ డిగ్రీ బిఇ బిటెక్ ప్రవేశాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు విజిట్ చేయండి

Comments are closed.