AP SSC 10th Results 2025:
ఆంధ్రప్రదేశ్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థుల కోసం సప్లిమెంటరీ రాత పరీక్షల యొక్క షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. పదో తరగతి పరీక్ష ఫలితాలను చాలెంజ్ చేయాలి అనుకునేటువంటి విద్యార్థుల కోసం రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ తేదీలతో పాటు ఎంత ఫీజు చెల్లించాలనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకోవచ్చు.
సప్లిమెంటరీ పరీక్ష తేదీల పూర్తి షెడ్యూల్ ఇదే:
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించాలి అనుకునే విద్యార్థులు ఈ క్రింది షెడ్యూల్ ద్వారా నిర్ణీత గడువులగా ఫీజు చెల్లించాలి.
- సప్లిమెంటరీ రాతపరీక్ష తేదీలు : మే 19 నుండి మే 28 వరకు.
- సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు: ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు.
- సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ఆలస్య రుసుము ₹50/- రూపాయలతో మే 19వ తేదీ వరకు చెల్లించవచ్చు.
- రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఫీజు చెల్లించాల్సిన తేదీలు: ఏప్రిల్ 24 నుండి మే 1వ తేదీ వరకు.
- రీకౌంటింగ్ కు ఒక్కో సబ్జెక్టుకు : ₹500/- ఫీజు చెల్లించాలి.
- రీ వెరిఫికేషన్ కు ఒక్కో సబ్జెక్టుకు : ₹1,000/- ఫీజు చెల్లించాలి.
- Official Website :https://www.bse.ap.gov.in/
పైన తెలిపిన షెడ్యూల్ను పూర్తిగా చూసి పదో తరగతి విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించి సప్లిమెంటరీ రాత పరీక్షలకు హాజరు కావలెను.
పరీక్ష ఫీజు ఎలా చెల్లించాలి?:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి రాత పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి సంబంధించినటువంటి ఫీజుని విద్యార్థుల యొక్క స్కూల్లోని హెడ్మాస్టర్ కు ఫీజు చెల్లించవలెను. తద్వారా హైస్కూల్లోని హెడ్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ లో లాగిన్ అయ్యి సంబంధిత విద్యార్థుల యొక్క ఫీజును చెల్లించవలెను.
కావున పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎటువంటి నిరాశకు లోను కాకుండా, సప్లమెంటరీ రాత పరీక్షలకు సిద్ధం కావలెను.
19 స్కూళ్లలో మొత్తం ఫెయిల్:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాలు చూసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లోని 19 స్కూళ్లలో పదో తరగతి రాసినటువంటి అభ్యర్థులు అందరూ ఫెయిల్ అయినట్లుగా ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు అధికారికంగా వివరాలు తెలపడం జరిగింది.
అలాగే 1680 స్కూళ్లలో 100% పాస్ అయినట్లుగా ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు తెలిపారు.
ఇంకా పదవ తరగతి పరీక్ష ఫలితాలు చూసుకోనటువంటి విద్యార్థులు ఈ లింకు ద్వారా ఇప్పుడే పదవ తరగతి ఫలితాలను చూసుకోవచ్చు.
