AP SSC Results 2025 Released:
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు 2025 పదో తరగతి ఫలితాలను, ఓపెన్ స్కూల్స్ పదవ తరగతి ఫలితాలను, ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ ఫలితాలను అధికారికంగా ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. పరీక్ష రాసినటువంటి లక్షల మంది విద్యార్థులు ఈ ఆర్టికల్ లో ఉన్నటువంటి అధికారిక లింక్స్ ద్వారా వారి యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు. వెంటనే విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్స్ ని ఎంటర్ చేసి మీ యొక్క ఫలితాలను చూసుకోండి.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలు చూసుకోవడానికి ఈ క్రింది ఇచ్చినటువంటి అధికారిక వెబ్సైట్స్ లింక్స్ ద్వారా వెంటనే చూసుకోగలరు.
పైన ఉన్నటువంటి నాలుగు వెబ్సైట్స్ లో ఏదో ఒక వెబ్సైట్ లింక్ ని ఓపెన్ చేసి, పదో తరగతి విద్యార్థులు వారి యొక్క ఫలితాలను వెంటనే చూసుకోవచ్చు.
సప్లమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు?:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు అధికారికంగా ప్రకటించారు.
సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- సప్లిమెంటరీ పరీక్ష తేదీలు : మే 19 నుండి 28వ తేదీ వరకు
- సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు : ఏప్రిల్ 24 నుంచి 30వ తేదీ వరకు
వాట్సాప్ ద్వారా ఫలితాలు ఎలా చూసుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు మరియు టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్స్ ఫలితాలను మీ మొబైల్ లోని వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
- ముందుగా ఆంధ్రప్రదేశ్ మనమిత్ర వాట్సాప్ నంబర్ +91 95523 00009 ని సేవ్ చేసుకోండి
- తర్వాత ఆ వాట్సాప్ కి హాయ్ అని మెసేజ్ పెట్టండి
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి సర్వీసెస్ కి సంబంధించిన లింకు వస్తుంది
- ఆ లింకుపై క్లిక్ చేసి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.
- అక్కడ పదో తరగతి ఫలితాలకు సంబంధించిన లింక్ ఉంటుంది ఆ లింకు పైన క్లిక్ చేయండి.
- క్లిక్ చేసి విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- ఫలితాలు స్క్రీన్ పైన వస్తాయి వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి
ఫలితాలు చూసుకున్న విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఫలితాలు గురించి ఈ క్రింది కామెంట్స్ లో తెలపండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశ వ్యాప్తంగా నిర్వహించేటువంటి పోటీ పరీక్షకు సంబందించిన ఫలితాలు వివరాలు కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఎటువంటి నిరుత్సాహపడకుండా మే నెలలో జరిగేటువంటి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కండి.
