TS ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల 2025 : ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఈరోజు అనగా ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు (TS Inter Results 2025) తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు.

కావున ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు tgbie.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోగలరు. మొదటి మరియు రెండో సంవత్సరం విద్యార్థులు కలిపి మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 19 కేంద్రాల్లో 60 లక్షల పరీక్ష పేపర్లను మూల్యాంకనం. చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల తేదీ, సమయం

ఫలితాల ముఖ్యమైన తేదీలు ఇవే:

  • పరీక్షలు నిర్వహించిన తేదీలు: మార్చి 5 నుంచి మార్చి 25, 2025
  • ఫలితాలు విడుదల చేసే తేదీ: ఏప్రిల్ 22,2025, మధ్యాహ్నం 12 గంటలకు.
  • సప్లిమెంటరీ పరీక్షలు జరిగే తేదీలు: 24 నుండి జూన్ 1 2025 వరకు
  • రీవాల్యుయేషన్ చేసే తేదీలు: మే నెల చివరివారంలో రీవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది.

ఫలితాలు ఎలా చూసుకోవాలి (Check Via SMS):

జనరల్ స్ట్రీమ్ విద్యార్థులు అయితే:

  • మొదటి సంవత్సరం విద్యార్థులు : TSGEN1 < హాల్ టికెట్ నంబర్ను > 56263 కు పంపండి
  • రెండవ సంవత్సరం విద్యార్థులు : TSGEN2 < హాల్ టికెట్ నెంబర్ను > 56263 కు పంపండి

ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులు అయితే :

  • మొదటి సంవత్సరం విద్యార్థులు : TSVOC1 < హాల్ టికెట్ నెంబర్ను > 56263 కు పంపండి.
  • రెండవ సంవత్సరం విద్యార్థులు : TSVOC2 < హాల్ టికెట్ నెంబర్ ను > 562632 కు పంపండి.

పాస్ మార్కులు మరియు సప్లిమెంటరీ పరీక్షల వివరాలు (Pass Marks & Supplementary Exams):

  • పాస్ మార్కులు: ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్పులు తెచ్చుకున్నట్లైతే వారు ఆ సబ్జెక్టులో పాస్ అయ్యారని అర్థం.
  • సప్లిమెంటరీ పరీక్షలు : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల కోసం మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు వారి కోసం నిర్వహించడం జరుగుతుంది.

ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్(Important Website Links):

ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇతర అధికారిక వెబ్సైట్లో కూడా వారి యొక్క ఫలితాలను చూసుకోవచ్చు. పైన తెలిపిన మరికొన్ని అధికారిక వెబ్సైట్లలో విద్యార్థులు ఫలితం చెక్ చేసుకోగలరు.

పరీక్షలో ఉత్తీర్ణులు అయినటువంటి విద్యార్థులు మెరుగైన మార్కులు తెచ్చుకోవాలనుకునేటువంటి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ వారు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు పే చేయొచ్చు. అధే ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించి ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ కి ప్రిపేర్ అవ్వాలి.

ఇలాంటి మరికొన్ని ఫలితాలకు సంబంధించినటువంటి ఉపయోగకరమైన సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించగలరు.