ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! రాష్ట్రంలో నిరుద్యోగులకు మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఏపీపీఎస్సీ త్వరలో 18 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఈరోజు అనగా ఏప్రిల్ 22, 2025న ఈనాడు దినపత్రికలో ఒక స్పెషల్ రిపోర్టు ప్రచురితమయ్యింది.
ఈ పద్దెనిమిది నోటిఫికేషన్స్ ద్వారా అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినటువంటి సందర్భంగా ఎస్సీ వర్గీకరణకి అనుగుణంగా పోస్టులకు సంబంధించి పోస్టర్ పాయింట్స్ ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోస్టర్ పాయింట్స్ ఖరారు అయిన తర్వాత వరుసగా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.

ఏపీపీఎస్సీ విడుదల చేయనున్న 18 నోటిఫికేషన్లు పూర్తి వివరాల లిస్ట్ :
- అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ :100 పోస్టులు
- అటవీ శాఖ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్: 641 పోస్టులు
- డ్రాప్స్ మెన్ గ్రేడ్-2 – టెక్నికల్ అసిస్టెంట్: 13 పోస్టులు
- తన్నేదార్ :10 పోస్టులు
- వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆఫీసర్ :10 పోస్టులు
- దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ : 7 పోస్టులు
- జిల్లా సైనిక్ అధికారి: 7 పోస్టులు
- ఇంటర్ విద్యా గ్రంథ పాలకుడు: 2 పోస్టులు
- ఉద్యానవన హార్టికల్చర్ ఆఫీసర్ :2 పోస్టులు
- మత్స శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ :3 పోస్టులు
- భూగర్భం నీటిపారుదల శాఖ టెక్నికల్ అసిస్టెంట్: 4 పోస్టులు
- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ క్యాటగిరి 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరి 3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరి 4 (మున్సిపల్ ): 11 పోస్టులు
- రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ : 1 పోస్టు
- జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు – 1 పోస్టు
- ఇతర శాఖల్లో ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నారు.
- నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల పూర్తి సమాచారం అర్హతలు వయస్సు దరఖాస్తు వివరాలన్ని అధికారిక నోటిఫికేషన్ లో వెల్లడి కావడం జరుగుతుంది.
AP పదో తరగతి ఫలితాలు విడుదల తేదీ, సమయం
నోటిఫికేషన్స్ విడుదల ఎప్పుడు :
ముందస్తు అంచనా ప్రకారం ఈ నోటిఫికేషన్ లో జూన్ నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ పూర్తయినందున ఎస్సీ వర్గీకరణ ఆధారంగా చేసుకుని రోస్టర్ పాయింట్లను ఖరారు చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఒక నెల రోజులు వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోస్టర్ పాయింట్స్ ఖరారు పూర్తయిన తర్వాత ఆ యొక్క రోస్టర్ పాయింట్స్ వివరాలు ఏపీపీఎస్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ వారు అన్ని నోటిఫికేషన్ కు ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు :
- సిలబస్ లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం తరచూ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయండి
- అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఇప్పటినుంచే ప్రిపేర్ అయితే చాలా మంచిది.
- ఏపీపీఎస్సీ ఉద్యోగాల అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ని విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ ఈ క్రింద ఇవ్వబడింది.
ఈ పోస్ట్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో నోటిఫికేషన్ కమ్ అప్డేట్ కోసం మా వెబ్సైట్ ను ఫాలో అవ్వండి.
FAQ’s:
1). నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది?:
సమాదానం: ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పాయింట్స్ పూర్తి కావడానికి ఒక నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కావున నోటిఫికేషన్స్ జూన్ నెలలో విడుదల చేస్తారు.
2). 18 రకాల నోటిఫికేషన్ లో ఏవి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్స్?
సమాధానం: గ్రూప్ 1 గ్రూప్ 2 తో పాటు అటవీశాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.