AP SSC Results 2025: ఫలితాలు విడుదల – ఎలా చెక్ చేసుకోవాలి?

AP SSC Results 2025 :

ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్ష ఫలితాలు 2025 విడుదల చేశారు. ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ లోని పదవ తరగతి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 6,19,275 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేసి విద్యార్థులు వారి యొక్క ఫలితాలను వాట్సాప్ ద్వారాగాని లేదా వెబ్సైట్లో చెక్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఈ ఫలితాలను అధికారికంగా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా చూసుకోవాలో చూడండి.

ఏపీ పదవ తరగతి ఫలితాల్లో రెండు మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.

  1. మొదటిది : అధికారిక వెబ్సైట్ ద్వారా https://www.bse.ap.gov.in/ మీ వివరాలు సబ్మిట్ చేసి తెలుసుకోవచ్చు.
  2. రెండవది: వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ +91 95523 00009 ద్వారా మీ యొక్క వివరాలను సబ్మిట్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీల వివరాలు:

  1. ఫలితాలు విడుదల చేసే తేదీ: ఏప్రిల్ 23, 2025 – ఉదయం 10 గంటలకు.
  2. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 2025 మే మూడో వారం నుండి జూన్ మొదటి వారం వరకుసప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తారు.
  3. సప్లిమెంటరీ ఫలితాలు విడుదల: 2025 జూన్ లో సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది.

మీ వాట్సాప్ లో ఫలితాలు ఎలా చూసుకోవచ్చు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాట్సాప్ గవర్నన్స్ నంబర్ ద్వారా ఈ క్రింది తెలిపినటువంటి స్టెప్స్ ని ఫాలో అవుతూ ఫలితాలను చూసుకోవచ్చు.

  1. ముందుగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ +91 95523 00009 ను మీ మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.
  2. ఆ వాట్సాప్ ను ఓపెన్ చేసి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  3. అక్కడ పదో తరగతి ఫలితాలు కి సంబంధించిన లింక్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి
  4. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  5. స్క్రీన్ పైన కనిపించిన రిజల్ట్స్ ని డౌన్లోడ్ చేసుకొని లేదా ప్రింట్ అవుట్ తీసుకొని సేవ్ చేసుకోవాలి.

అధికారిక వెబ్సైట్లో ఎలా చూసుకోవాలి:

ఏపీ టెన్త్ ఫలితాలు అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు చూసుకునేటువంటి వారు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

appsc 18 నోటిఫికెషన్స్ విడుదలకు రంగం సిద్ధం

  1. ముందుగా ఏపీ టెన్త్ రిజల్ట్స్ అఫీషియల్ వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయండి
  2. ఏపీ టెన్త్ రిజల్ట్స్ రిలీజ్ ఆప్షన్పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి
  4. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్న వెంటనే విద్యార్థుల రిజల్ట్స్ స్క్రీన్ పైన కనిపిస్తాయి.
  5. స్క్రీన్ పైన చూపించిన రిజల్ట్స్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

Check Here

FAQ’s:

  1. ఏపీ పదవ తరగతి ఫలితాలు విడుదల తేదీ, సమయం ఎప్పుడు? – సమాధానం: ఏప్రిల్ 23 ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేశారు.
  2. ఫలితాలు ఎలా చూసుకోవాలి? – పైన ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లింక్స్ క్లిక్ చేసి మీ యొక్క ఫలితాలను చేసుకోవచ్చు .
  3. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?: సప్లిమెంటరీ పరీక్షను మే మూడో వారం నుంచి నిర్వహించే అవకాశం ఉంది.