ఏపీ మెగాడీఎస్సీ 16,347 పోస్టులతో విడుదల | AP Mega DSC 2025 | free jobs in Telugu

AP Mega DSC 2025:

ఆంధ్రప్రదేశ్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి 16,347 పోస్టులతో అధికారికంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఇందులో పాత 13 జిల్లాల వారిగా కార్డియాల లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ఈ మెగా డిఎస్సి ఉద్యోగాలకు అన్ని జిల్లాల వారు అర్హతలు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. డిఎడ్ బిఎడ్ అర్హత కలిగి, 10+2 లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత ఉంది. జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూట్ సెలక్షన్ కమిటీ ద్వారా రాత పరీక్ష నిర్వహించి ఈ డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేస్తారు. రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 20th ఏప్రిల్ 2025

అప్లికేషన్ ఆఖరి తేదీ : 15th మే 2025

పరీక్షలు నిర్వహించే తేదీలు: 6th జూన్ నుండి 6th జూలై వరకు

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి మహిళలకు పురుషులకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. దీనితోపాటు రిజర్వేషన్ అన్నటువంటి ఎస్సీ, ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది

Join WhatsApp group

పోస్టుల వివరాలు వాటి అర్హతలు :

ఆంధ్రప్రదేశ్లో విడుదలైన మెగా డీఎస్సీ 16,347 ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి డీఎడ్ లేదా బి.ఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఈ డీఎస్సీ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ

సెలక్షన్ చేసే విధానం :

మెగా డీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు జిల్లాల వారీగా జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఆరో తేదీ వరకు ఆన్లైన్ లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు :

ఆన్లైన్లో డీఎస్సీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్లు తెలిపినటువంటి అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. కావున అభ్యర్థులు దరఖాస్తు ఫీజు వివరాలకు సంబంధించి అప్లికేషన్ లో వివరాలు చూడగలరు.

NLC సంస్థలో 200 ఉద్యోగాలు

శాలరీ అంత ఉంటుంది :

డీఎస్సీ టీచర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నెలకు ప్రారంభంలోనే 30,000 నుంచి 45 వేల రూపాయల వరకు పోస్టులను అనుసరించి జీతాలు చెల్లించడం జరుగుతుంది. వీటితోపాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి

ఉండవలసిన సర్టిఫికెట్స్ :

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సి సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

ఎలా అప్లై చేసుకోవాలి :

నోటిఫికేషన్లను పూర్తి సమాచారం చూసినటువంటి అభ్యర్థులు అర్హతలు కలిగి ఉన్నట్లయితే ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోగలరు.

notification PDF

apply online