Railway Coach Factory Recruitment 2025:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుండి 23 పోస్టులతో స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడానికి 10th అర్హతతో లెవెల్ 1, టెక్నీషియన్ 3 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ లోని విభాగాల్లో అర్హతలు కలిగి, 10th అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 4th జనవరి 2025 |
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 3rd ఫిబ్రవరి 2025 |
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:
రైల్వే శాఖకు సంబందించిన కోచ్ ఫ్యాక్టరీ కాపుర్తల నుండి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేయడానికి లెవెల్ 1, టెక్నీషియన్ 3 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగి స్పోర్ట్స్ కోటలో సర్టిఫికెట్స్ కలిగినవారు ఈ రైల్వే ఉద్యోగాలకు అర్హులు.
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్ :
రైల్వే శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ట్రయిల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. స్పోర్ట్స్ కోటాలో అర్హత ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి.
ఎంత వయస్సు ఉండాలి:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాకు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అటవీ శాఖలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ₹500/- చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
స్పోర్ట్స్ కోటా కలిగిన సర్టిఫికెట్స్, 10th, ITI అర్హత సర్టిఫికెట్స్
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10th అర్హతతో 625 గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
