AP Outsourcing Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 371 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు విధానంలో విశాఖపట్నం, కడప, తూర్పుగోదావరి జిల్లాల నుండి జోన్లవారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. నర్స్ పోస్టులకి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ లేదా BSC నర్సింగ్ చేసినవారు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లై చేయండి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 371 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 3rd జనవరి 2025 |
| ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 17th జనవరి 2025 |
అప్లికేషన్ ఫీజు:
ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు OC అభ్యర్థులు ₹700/- ఫీజు చెల్లించి Apply చెయ్యాలి. SC, ST, BC, PH అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి.
జిల్లా కోర్టుల్లో 554 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి :
01.01.2025 నాటికీ 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
AP HMFW హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 371 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు విధానంలో విశాఖపట్నం, కడప, తూర్పుగోదావరి జిల్లాల నుండి జోన్లవారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. నర్స్ పోస్టులకి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ లేదా BSC నర్సింగ్ చేసినవారు అర్హులు.
వైజాగ్ HPCl లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
సెలక్షన్ ప్రాసెస్:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, చేసిన సర్వీసెస్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 100 మార్కులకు మెరిట్ జాబితాను తయారు చేసి అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- ఫిక్స్డ్ శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు
ఉండవలసిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.
10th, Gnm, bsc నర్సింగ్ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
4th నుండి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
SC, ST, OBC, EWS కాస్ట్ సర్టిఫికెట్స్
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
AP, TS ఆధార్ సెంటర్స్ లో ఆపరేటర్స్ జాబ్స్ : ఇంటర్ అర్హత
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ పోస్టులకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.
