AP High Court Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ హైకోర్టు నుండి లా క్లర్క్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసారు. మొత్తం 05 పోస్టులతో కాంట్రాక్టు విధానంలో రాత పరీక్ష, ఫీజు లేకుండా ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 5 సంవత్సరాల లా డిగ్రీ చేసిన అభ్యర్థులకు ఛాన్స్ కల్పిస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవార్ధంగా నెలకు ₹35,000/- శాలరీ చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలయిన లా క్లర్క్ కాంట్రాక్టు ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 17th జనవరి 2025 తేదీలోగా అప్లికేషన్స్ ఆఫ్ లైన్ లో నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రెస్ కు పంపించవలెను. దరఖాస్తులు పంపించవలసిన అడ్రస్ “రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, AP, పిన్ కోడ్ – 522239” కు పంపించవలెను.
పోస్టుల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లా క్లర్క్ ఉద్యోగాలకు Apply చేయ్యాలి అంటే 10+2 తర్వాత 5 సంవత్సరాల లా డిగ్రీ చేసినవారు అర్హులు లేదా 3 సంవత్సరాల రెగ్యులర్ ల డిగ్రీ చేసినవారు Apply చేసుకోవచ్చు.
గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు: No Exam, No Fee
శాలరీ వివరాలు:
లా క్లర్క్స్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు హానరారిమ్ విధానంలో నెలకు ₹35,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
హైకోర్టు లా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా, అమరావతిలోని హైకోర్టులో వైవా వొస్ (ఇంటర్వ్యూ) నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
AP విద్యాశాఖ సమగ్ర శిక్షాలో 255 ఉద్యోగాలు : Apply
అప్లికేషన్ ఫీజు ఎంత:
లా క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
Ap హైకోర్టు ఉద్యోగాలకు Apply చేయడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
లా డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా జిల్లా కోర్టు, హైకోర్టు జాబ్స్ నోటిఫికేషన్: 1673 పోస్టులు
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలకు Apply చేయడానికి ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లా క్లర్క్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలవారు Apply చెయ్యొచ్చు.
