Telangana VRO Jobs Notification 2024:
తెలంగాణా 8,000 విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో కొత్త రూల్స్ తీసుకొస్తూ రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని పోస్టులకు డిగ్రీ అర్హత, మరికొన్ని పోస్టులకు ఇంటర్ అర్హతగా నిర్ణయించి రిక్రూట్మెంట్ చేయాలని చూస్తున్నారు. 8,000 VRO ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ కొత్త రూల్స్ పూర్తి వివరాలు చూసి తెలుసుకోగలరు. కొత్త రూల్స్ తీసుకురావడానికి ఈరోజు అసెంబ్లీలో కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చి భూ రికార్డులు చూడటానికి కొత్త విధానాలతో VRO ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా VRO ఉద్యోగాలకు ఓపెన్ మార్కెట్ కింద విడుదలయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించే అవకాశం ఉంది.
ఎంత వయస్సు ఉండాలి:
01.01.2025 నాటికీ అభ్యర్థులకి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP గ్రామం సచివాలయాల్లో 297 VAS ఉద్యోగాలు
ఎంపిక విధానం:
2018 లో VRO నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు TSPSC ద్వారా రిక్రూట్మెంట్ చేశారు. ఈసారి కూడా Tspsc ద్వారా రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి, మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ ఎంత ఉంటుంది:
VRO ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పే స్కేల్ ప్రకారంగా ₹19,900 నుండి ₹35,900/- వరకు జీతాలు ఉంటాయి అన్ని అలవెన్సెస్ కలుపుకోని మంచి జీతాలు ఉంటాయి.
TGSRTC 3,039 గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ
కొత్తగా ఆర్ఓఆర్ యాక్ట్ బిల్లు అంశాలు:
తెలంగాణా భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకం చట్టం – 2024 కు సంబందించి తెలంగాణా రాష్ట్రంలో భూమి వివాదలకు పరిష్కారం లభించే విధంగా అసెంబ్లీ బిల్ ప్రవేశ పెట్టి కొత్తగా నియమ నిబంధనలు తీసుకొనివస్తున్నారు. ఈ బిల్ పాసయ్యాక ధనికనుగుణంగా పనులు చేయడానికి భారీగా VRO ల అవసరం ఎంతైనా ఉంటుందని ప్రభుత్వం భారీ స్థాయిలో 8,000+ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలనీ భావిస్తోంది.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
10th, ఇంటర్ మార్కుల లిస్ట్స్.
కుల ధ్రువీకరణ పత్రాలు.
1st నుండి 7th వరకు చదువుకున్న స్టడీ సర్టిఫికెట్స్
ఆధార్ కార్డు, రేషన్ కార్డులు కలిగి ఉండాలి.
పోస్టల్ శాఖలో కొత్తగా అసిస్టెంట్ ఉద్యోగాలు
పైన తెలిపిన డాక్యుమెంట్స్ అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి చాలా అవసరం కావున వాటిని ముందుగానే సమాకుర్చుకోవాలి.
తెలంగాణా VRO ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
