KVS, Navodaya Notification 2024:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేంద్రియ విద్యాలయాలు, నవోదయాల్లో ఖాళీగా ఉన్న 6,700 ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రియ విద్యాలయాల్లో 5,388 పోస్టులు, నవోదయాల్లో 1,316 ఉద్యోగాలు ఉన్నాయి.టీజీటీ, పీజీటీ, PRT, జూనియర్ అసిస్టెంట్, వార్డెన్, ఇతర పోస్టులను భర్తీ చేస్తారు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూడగలరు.
6,700 పోస్టుల వివరాలు:
AP, TS మరియు ఇతర రాష్ట్రాలలో ఉన్న కేంద్రియ విద్యాలయ, నవోదయాల్లో ఖాళీగా 6,700 పోస్టులను భర్తీ చేయడానికి 2 రోజుల క్రితం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
కేంద్రియ విద్యాలయాల్లో 5,388 పోస్టులు, నవోదయాల్లో 1,316 ఉద్యోగాలు ఉన్నాయి.టీజీటీ, పీజీటీ, PRT, జూనియర్ అసిస్టెంట్, వార్డెన్, ఇతర పోస్టులను భర్తీ చేస్తారు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా రెవెన్యూ శాఖలో 10,965 VRO జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, GK సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్నిరకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
అన్ని కేటగిరీల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించాలి. నోటిఫికేషన్ లో ఫీజు వివరాలు ఇస్తారు వాటిని బట్టి చెల్లించాలి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రైల్వేలో 1800+ జాబ్స్ నోటిఫికేషన్
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు:
KVS, నవోదయ ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తారు. ప్రస్తుతానికి కేంద్ర కేబినెట్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.
KVS, నవోదయ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
