రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో గ్రూప్ C, గ్రూప్ D Govt జాబ్స్ | Railway Coach Factory Notification 2024 | Freejobsintelugu

Railway Caoch Factory Notification 2024:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కి సంబందించిన ఈస్టర్న్ రైల్వే నుండి క్రీడా విభాగంలో 60 గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అర్హులు. రాత పరీక్ష లేకుండా ట్రయిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 15th నవంబర్ 2024

ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 14th నవంబర్ 2024

ట్రయిల్ టెస్ట్ : 2nd week జనవరి 2025

అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో మాత్రం దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి 60 గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు : 10th అర్హత

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:

ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా, స్పోర్ట్స్ కోటాలో ఉన్న అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ట్రయిల్ టెస్ట్ మాత్రమె నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష / ఆఫ్ లైన్ విధానంలో రాత పరీక్ష ఉండదు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అప్పర్ ఏజ్ రిలాక్స్యేషన్ ఉండదు.

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : 10th పాస్

శాలరీ వివరాలు:

రైల్వే ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹40,000/- వరకు శాలరీలు చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావున ఇతర అన్ని రకాల TA, DA, HRA వంటి అలవెన్సెస్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులలో రిజర్వేషన్ లేని అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. ఇందులో 90% వరకు ఫీజు అభ్యర్థులకు అకౌంట్ లోకి రిఫండ్ చేయడం జరుగుతుంది.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ లిస్ట్స్ ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

స్పోర్ట్స్ కోటా అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల దరివీకరణ పత్రాలు ఉండాలి.

ఎలా Apply చేసుకోవాలి:

నోటిఫికేషన్ లోని సమగ్ర సమాచారం చూసిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply ఆన్లైన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేయనుకోగలరు.

Join What’s App Group

Notification PDF

Apply Online Link

రైల్వే ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు.