AP మత్స్య శాఖలో పరీక్ష లేకుండా జిల్లా ఆఫీసర్ ఉద్యోగాలు | AP Fisheries Dept. Notification 2024 | Freejobsintelugu

AP Fisheries Dept. Notification 2024:

ఆంధ్రప్రదేశ్ మాత్స్య శాఖ నుండి 03 పోస్టులతో ఆఫీసర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఫిషరీస్ సైన్స్ /జువాలజీ/మెరైన్ సైన్సెస్/మెరైన్ బయాలజీ/ఫిషరీస్‌లో మాస్టర్స్ ITలో ఎకనామిక్స్/మాస్టర్స్ లేదా కనీసం IT /కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిప్లొమా కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోగలరు. మీ అప్లికేషన్ ఫారం Mail చేస్తే చాలు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ చేసే విధానం:

అర్హతలు కలిగిన అభ్యర్థులు మీ అప్లికేషన్ ఫారంను comfishap@gmail.com కు మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. అక్టోబర్ 24,2024 తేదీలోగా అప్లికేషన్స్ ను సబ్మిట్ చేసుకోవాలి.

AP వెల్ఫేర్ Dept లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: 10th అర్హత

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి 03 పోస్టులతో ఆఫీసర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిషరీస్ సైన్స్ /జువాలజీ/మెరైన్ సైన్సెస్/మెరైన్ బయాలజీ/ఫిషరీస్‌లో మాస్టర్స్ ITలో ఎకనామిక్స్/మాస్టర్స్ లేదా కనీసం IT /కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిప్లొమా కలిగినవారు అప్లికేషన్ పెట్టుకోగలరు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

తెలంగాణా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 5,000 Govt జాబ్స్

ఎలా ఎంపిక చేస్తారు:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హతలు, అనుభవం, వయస్సు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఫిషరీస్, ఆక్వాకల్చర్ లో 03 సంవత్సరాల అనుభవం కలిగినవారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఎంత శాలరీ ఉంటుంది:

మాత్స్య శాఖలో ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు ₹45,000/- జీతం చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.

తెలంగాణా దేవాదయ శాఖలో 111 ఉద్యోగాలు

కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి:

అప్లికేషన్ ఫారం, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ్ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

అనుభవం సర్టిఫికెట్స్ కూడా కలిగి ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో ఇచ్చి mail అడ్రస్ కు దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించాలి.

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ మాత్స్య శాఖ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నా అన్ని జిల్లాలవారు Apply చేసుకోగలరు.