TS 10th Results 2024 Release Date:
మే 2,3 తేదీల్లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం లక్ష్యంగా పెట్టుకు న్నది. శనివారంతో ప్రధాన పరీక్షలు ముగియగా, కొన్ని మైనర్ సబ్జెక్టులకు మంగళవారం వరకు జరుగుతాయి. శనివారం సాంఘికశాస్త్రం పరీక్షకు 4,94,068 మంది (99.64శాతం) హాజరు కాగా, 1,747 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల విధుల్లో నిర్ల క్ష్యంగా వ్యవహరించడంతో మహబూబాబాద్ జిల్లాలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారి, ముగ్గురు ఇన్విజిలేటర్లను పరీక్షల నుంచి తప్పించారు.
10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు వెబ్‌సైట్‌లో అందించిన Results లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వారి స్కోర్‌లను పొందవచ్చు. TS SSC రిజల్ట్స్ 2024కి సంబంధించి Upto Date సమాచారాన్ని ఈ వెబ్సైటులో చూడవచ్చు.
జీవ శాస్త్రం సబ్జెక్టులో అందరికీ 3 మార్కులు: Official
బ్లూ ప్రింట్ కు విరుద్ధంగా ఇచ్చిన పదో తరగతి జీవశాస్త్రం ప్రశ్నలపై ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరో ప్రశ్నకు జవాబు రాసిన వారికి రెండు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే మార్కులు కలుపుతారు. మార్చి 28న జీవ శాస్త్రం పరీక్ష జరిగింది. సెక్షన్-2లో ఇచ్చిన 6వ ప్రధాన ప్రశ్నలో కొన్ని చిత్రాల కింద నాలుగు ప్రశ్నలు ఇచ్చారు. మొదటి రెండు విద్యాప్రమాణాలను అనుగుణంగా లేకపోవ డంతో సబ్జెక్టు టీచర్లు అభ్యంతరాలను లేవనె త్తారు. బ్లూప్రింట్కు విరుద్ధంగా తప్పుగా ఇచ్చారని ఫిర్యాదు చేశారు.
ఇదే విషయంపై ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఎస్సీఈఆర్టీ నుంచి నివేదిక కోరారు. అధ్యయనం చేసిన ఎస్సీఈఆర్టీ విషయ నిపుణుల బృందం ప్రశ్నల్లో తప్పులున్నట్లుగా గుర్తించింది. ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు బుధవారం అద నంగా మార్కులు ఇచ్చేందుకు అంగీకరిం చారు. బుధవారం అన్ని జిల్లాల డీఈవోలతో ఎస్సెస్సీ బోర్డు అధికారులు వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఒక్కో మార్కు చొప్పున రెండు ప్రశ్నలకు రెండు మార్కులేసే విష యంపై స్పష్టత ఇచ్చారు. ఐదో ప్రశ్నను ఇంగ్లి ష్లో లో ఒకలా, తెలుగులో మరోలా ఇచ్చారు. ఈ రెండూ జీవశాస్త్రంలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్యార్థులు దేనికి సమాధానం రాసినా మార్కులు వేయాలని నిర్ణయం తీసు కున్నారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం బుధవారం నుంచి ప్రారంభ మైంది. మరో 15 రోజుల్లో ఈ మూల్యాం కనం ముగుస్తుంది. మే 2, 3 తేదీల్లో ఫలి తాలు విడుదల చేయాలని అధికారులు భావి స్తున్నారు.
Receive TS 10th Results 2024 through SMS:
కొన్నిసార్లు TS SSC (10వ తరగతి) 2024 ఫలితాల వెబ్‌సైట్ ప్రతిస్పందించకపోవచ్చు.
అటువంటి సందర్భాలలో, విద్యార్థులు వారి TS మనబడి 10th ఫలితాలను ఆఫ్‌లైన్‌లో SMS ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. ఈ క్రింది స్టెప్స్ ద్వారా TS 10th Results ను SMS ద్వారా పొందండి.
ఫోన్‌లో SMS అప్లికేషన్‌ను Open చేయండి
ఈ ఫార్మాట్‌లో Message టైప్ చేయండి: TS10ROLL NUMBER
56263కు పంపండి
తెలంగాణ SSC results 2024 అదే నంబర్‌కు SMSగా పంపబడుతుంది.
TS SSC Results For Re-Evaluation:
ధృవీకరణ మరియు రీకౌంటింగ్ ప్రక్రియ తర్వాత, బోర్డు జూలై 2024లో TS SSC రీ-ఎవాల్యుయేట్ ఫలితాన్ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు.
విద్యార్థులు తమ వార్షిక ఫలితాలను యాక్సెస్ చేసిన విధంగానే వారి TS SSC ఫలితాలను 2024ని యాక్సెస్ చేయవచ్చు.
How To Check TS 10th Resuts 2024:
తెలంగాణా 10th పరీక్షలు రాసిన అభ్యర్థులు వారి రోల్ నెంబర్ తో కింద ఇచ్చిన official వెబ్సైటులో మీ రోల్ నెంబర్ enter చేసి submit చేస్తే మీ రిజల్ట్స్ వెంటనే చూసుకోవచ్చు.
TS 10th Results : Official Website
🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.