AP 10th, ఇంటర్ రిజల్ట్స్ విడుదల డేట్స్ వచ్చేశాయి | AP Inter Results 2024 | AP 10th Results 2024

AP 10th, Inter Results 2024:

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రా లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామ న్నారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.

Join Our Telegram Group

AP 10th ఫలితాలు విడుదల తేదీ ఇదే:

ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాం కనం కూడా ఈనెల ఎనిమిదో తేదీ నాటికి పూ ర్తికానుంది. ఈ ఫలితాలను సైతం వారం, పది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కువమంది సిబ్బంది నియామకం, టెక్నాలజీ వినియోగం, ప్రతి మూల్యాంకన కేంద్రా నికి బోర్డు నుంచి ప్రత్యేక అధికారుల పరిశీలన వం టి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులకు సప్లి మెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2022-23 విద్యాసంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్షలకు సం బంధించి ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26న, టెన్త్ ఫలితాలను మే 6వ తేదీన విడుదల చేశారు.

AP ఇంటర్ రిజల్ట్స్ విడుదల తేదీ :

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యార్థులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడ దన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. వెంటనే విద్యాశాఖ అధికారులు మూల్యాంకనం చేపట్టారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. వీరి జవాబుపత్రాల మూల్యాంకనం కోసం సుమారు 23 వేలమంది అధ్యాపకులను ఇంటర్ విద్యామండలి నియమించింది. పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు. వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెం టర్లను ఏర్పాటు చేశారు. గతంలో తలెత్తిన ఇబ్బందు లను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేం ద్రంలో గరిష్టంగా 900 మంది వేల్యూయేటర్లు ఉండే లా చర్యలు తీసుకున్నారు.

TSPSC గ్రూప్ 4 ఫైనల్ రిజల్ట్స్ 1:3 జాబితా విడుదల

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు : Apply

రైల్వేలో 1266 పోస్టులతో పరీక్ష లేకుండా జాబ్స్

EMRS లో 28,000 పోస్టులతో నోటిఫికేషన్

How To Check AP 10th, Inter Results 2024:

*Results అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

*10వ తరగతి (SSC) / Inter ఫలితాల ట్యాబ్‌పై క్లిక్ చేయండి

*అందించిన ఫీల్డ్‌లో మీ రోల్ నంబర్‌ను నమోదు చేయండి

*AP SSC /Inter ఫలితాలు 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది

*విద్యార్థులు తక్షణ సూచనల కోసం వారి AP SSC / Inter ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయాలి

AP 10th Results : Official Website

AP Inter Results : Official Website

Join Our Telegram Group

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!