AP DSC వాయిదా – Official | AP DSC Exams 2024 Postponed | AP TET Results 2024

AP TET Results 2024:

AP టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
AP TET 2024 జవాబు కీ మరియు Response షీట్ 2024 మార్చి 5న జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు Response Sheets మరియు సమాధానాల కీలపై అభ్యంతరాలను మార్చి 11 వరకు దాఖలు చేసే అవకాశం కల్పించారు.

AP TET ఫలితాలు, DSC పరీక్షలు వాయిదా:

ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది.

AP DSC Exams Postponed – Official:

నేడు జరగాల్సిన డీఎస్సీ పరీక్ష వాయిదా వేసిన విద్యాశాఖ.

ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి డీఎస్సీ నిర్వ హించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 57 నెలల పాటు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉంటాయనగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజానికి ఎన్నికలకు ముందు ఇంత పెద్ద నియామక క్రతువును ఏ ప్రభుత్వమూ తెరమీదికి తీసుకురాదు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వస్తే పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందని ముందుగానే అంచనా వేసుకుంటారు. కానీ, వైసీపీ ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా? అంటే తెలుసు. కానీ, ఉద్దేశ పూర్వకంగానే ఎన్ని కలకు మూడు మాసాల ముందు డీఎస్సీ ఇచ్చింది. ఎలానూ ఆగిపోతుంది కాబట్టి.. ఇచ్చామన్న పేరు కొట్టేయాలని భావించింది. దీనిని బట్టి ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. షెడ్యూలు ప్రకారం శనివారం(నేడు) నుంచి డీఎస్సీ పరీ క్లలు ప్రారంభం కావాలి. కానీ, అలా జరగడం లేదు. ఎలక్షన్ కమిషన్ నుండి పరీక్షల నిర్వహణకు అనుమతి వచ్చాక TET ఫలితాలు విడుదల చేసి DSC నిర్వహించడం జరుగుతుంది అని AP విద్యాశాఖ ప్రకటించింది.

AP TET Results 2024 Date & Time:

టెట్ ఫలితాలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/ ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.

పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ AP TET ఫలితాలను 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఈ ప్రత్యక్ష బ్లాగును తనిఖీ చేస్తూ ఉండండి.

TS ప్రభుత్వం 10th అర్హతతో డైరెక్ట్ జాబ్స్ : Apply

TCS లో మీకు Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్

పశు సంవర్ధక శాఖలో 10th అర్హతతో govt జాబ్స్

సికింద్రాబాద్ రైల్వేలో 830 Govt జాబ్స్

How To Check AP TET Results 2024:

పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – aptet.apcfss.in.

ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.

‘Get Results’ బటన్‌పై క్లిక్ చేయండి.

APTET ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

Official Website : Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment