తెలంగాణ అన్ని జిల్లాలవారికి 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | TS EMRS Jobs Notification 2025

TS EMRS Notification 2025:

తెలంగాణలోని ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం నడుపుచున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ EMRS స్కూల్స్లో బోధన మరియు బోధనేతర పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుందని ప్రకటనలో తెలియజేశారు. పదో తరగతి లేదా డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను విద్యార్హతల్లో పొందిన మార్కులు ఆధారంగా అలాగే డెమో ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి వెంటనే అప్లై చేయండి.

పోస్టుల ముఖ్యమైన వివరాలు?:

EMRS ఔట్సోర్సింగ్ ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join Whats App Group

పోస్ట్ పేరు అర్హతలు ఖాళీల సంఖ్య
టీజీటీ డిగ్రీతో పాటు బీఈడీ లేదా CTET01
లైబ్రేరియన్డిగ్రీ BLIS తో పాటు MLIS కూడా01
సెక్యూరిటీ గార్డ్పదవ తరగతి24
ల్యాబ్ అటెండెంట్పదవ తరగతితో పాటు లేబరేటర్ టెక్నిక్ లో సర్టిఫికెట్01
మెస్ హెల్పర్పదవ తరగతి18
వంట మనిషిపదవ తరగతి02
స్వీపర్పదవ తరగతి11
గార్డెనర్పదవ తరగతి02

పోస్టుల అర్హతలు?:

తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఇంటర్ అర్హతతో డైరెక్ట్ ఉద్యోగాలు

ఎంత వయస్సు ఉండాలి?:

EMRS ఉద్యోగాలకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కనిష్టంగా ₹15,000/- నుండి ₹40 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

సెలక్షన్ ప్రాసెస్:

EMRS ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

రైల్వే IRCTC లో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్

  1. ముందుగా అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు.
  2. అర్హతల్లో ఉన్న మెరిట్ మార్కులు ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసి,
  3. వారిచేత డెమో క్లాసెస్ నిర్వహిస్తారు.
  4. అని అర్హతలు కలిగి డెమో క్లాసెస్ లో మంచిగా పెర్ఫామ్ చేసిన వారికి
  5. ఈ ఉద్యోగాలు ఇచ్చి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, పోస్టింగ్ ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు?:

EMRS ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది తెలిపిన తేదీలలో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.

  • అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 25th నవంబర్, 2025
  • అప్లికేషన్స్ ఆఖరి తేదీ: 10th డిసెంబర్, 2025

ముఖ్యమైన లింక్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని గడువులోగా అప్లై చేయండి.

Notification PDF

డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని సందర్శించండి.