NIRDPR Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి మూడు డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను మూడు నెలల కాంట్రాక్ట్ విధానంలో ఒక ప్రాజెక్టులో పని చేయడానికి అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసుకున్నటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రాతపరీక్ష ఫీజు లేకుండా డిసెంబర్ 10వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహించి, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు?:
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ (NIRDPR) |
| పోస్ట్ పేరు | డేటా ఎంట్రీ అసిస్టెంట్ |
| అర్హతలు | ఇంటర్మీడియట్ |
| వయస్సు | 18 నుండి 30 సంవత్సరాలు |
| ఇంటర్వ్యూ తేదీ | డిసెంబర్ 10, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
పోస్టుల అర్హతలు?:
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ లో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
తెలంగాణ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: ఇంటర్
ఎంత శాలరీ ఇస్తారు?:
కాంట్రాక్టు విధానంలో విడుదలైన డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15 వేల రూపాయలు జీతాలు చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆరు నెలలపాటు కాంట్రాక్టు విధానంలో పనిచేయాలి. ఇతర అలోవెన్సెస్ ఏమీ ఉండవు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి అభ్యర్థులు డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
తెలంగాణ దేవాదాయ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్?:
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అర్హతలను ఆధారంగా చేసుకొని అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు.
- అభ్యర్థులకు డిసెంబర్ 10, 2025న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూలో అర్హత పొందిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి,
- కాంట్రాక్టు విధానంలో వారికి ఉద్యోగాలు ఇస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ?:
డిసెంబర్ 10, 2025న అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ నిర్వహించే వేదిక: NIRDPR వికాస్ ఆడిటోరియం, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 5000030.
దరఖాస్తు ఫీజు?:
NIRDPR నుండి విడుదలైన కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకొని, ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
ముఖ్యమైన లింక్స్?:
NIRDPR ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.
Note: పైన తెలిపిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు గడువులోగా అప్లికేషన్ పెట్టుకొని ఇంటర్వ్యూకి హాజరవ్వండి.
