రైల్వే IRCTC లో ₹30వేల జీతంతో డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC Jobs Notification 2025

IRCTC Jobs Notification 2025:

రైల్వే సంస్థ IRCTC నుండి 50 పోస్టులతో హాస్పిటల్ మానిటర్ ఉద్యోగాలను రెండు సంవత్సరాలు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి ఆఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టింగ్ ఇస్తారు. హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన కోర్సుల్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ₹30 వేల రూపాయల జీతంతో పాటు ఇతర అన్ని రకాల ఎలివేషన్స్ కల్పిస్తూ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు?:

Join What’s App Group

అంశమువివరాలు
సంస్థ పేరు రైల్వే IRCTC
పోస్ట్ పేరు హాస్పిటల్ మానిటర్ పోస్టులు
మొత్తం పోస్టులు50
వయస్సు18 నుండి 28 సంవత్సరాలు
ఇంటర్వ్యూ తేదీలుడిసెంబర్ 8th/9th/10th
అధికారిక వెబ్సైట్Click Here

పోస్టుల అర్హతలు:

రైల్వే IRCTC సంస్థ నుండి విడుదలైన హాస్పిటాలిటీ మానిటర్ 50 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కోర్సుల్లో డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి వారికి ప్రాధాన్యత ఉంటుంది.

తెలంగాణ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటర్ అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.

ఎంత శాలరీ ఉంటుంది?:

హాస్పిటాలిటీ మానిటర్లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు రైల్వే డిపార్ట్మెంట్ నెలకు ₹30 వేల రూపాయల జీతంతో పాటు డైలీ అలవెన్సెస్, లాడ్జింగ్ చార్జెస్, నేషనల్ హాలిడే ఎలివేషన్స్ తో పాటు ఉద్యోగస్తులకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తారు.

ఎంపిక చేసే విధానం?:

రైల్వే హాస్పిటల్ మానిటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అర్హతలను బట్టి షార్ట్ లిస్టు చేస్తారు.
  2. డిసెంబర్ నెలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  4. మెడికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు?:

రైల్వే IRCTC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరుకావలెను.

  • ఇంటర్వ్యూ డేట్స్ : 8th/9th/10th డిసెంబర్, 2025
  • ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: IRCTC zonal Office, 3 Koilaghat Street, ground floor, Kolkata – 700 001

ముఖ్యమైన లింక్స్:

రైల్వే IRCTC కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Notification & Application Form

Official Website

Note : పైన తెలిపిన రైల్వే ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావలెను.