TG Welfare Dept. Outsourcing Jobs Notification 2025:
తెలంగాణ మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 17 కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్ ఇంటెండెంట్, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, ఏఎన్ఎం వంటి ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేదు. మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయసు, సెలక్షన్ ప్రాసెస్ , అప్లికేషన్ ప్రాసెస్ అంటే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో చూసి తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు?:
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణ మహిళ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ |
| పోస్టుల పేరు | డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, ఏఎన్ఎం, ఇతర పోస్టులు |
| అర్హతలు | ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత |
| వయస్సు | 18 నుండి 44 సంవత్సరాలు |
| ఆఖరు తేది | డిసెంబర్ 5th, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు?:
తెలంగాణ మహిళల అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా ఉండవలసిన అవసరం ఉంటుంది.
తెలంగాణ దేవాదాయ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు
ఎంత వయసు ఉండాలి?:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, OBC, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో మరొక ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు?:
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹4,000/- నుండి ₹25 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమి ఉండవు.
సెలక్షన్ ప్రాసెస్?:
ఈ ఉద్యోగం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.
- ముందుగా అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు.
- ఎటువంటి రాత పరీక్ష ఉండదు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- అర్హతలు, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ పోస్టింగ్ ఇస్తారు
దరఖాస్తు ఫీజు?:
కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు డిసెంబర్ 5, 2025వ తేదీ వరకు సమయం ఉంది. అర్హతలు కలిగిన వాడు గడువులోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
ముఖ్యమైన లింక్స్:
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి అప్లై చేయండి.
Note: నోటిఫికేషన్ అనుభూతి వివరాలు చూసిన తర్వాత అన్ని అర్హతలు కలిగిన వారు గడువులోగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి
