తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana endowment dept. notification 2025

Telangana endowment dept. Notification 2025:

తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఒక సంవత్సరం కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్ట్లను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అడ్వకేట్ గా జిల్లా కోర్టులో గాని లేదా హైకోర్టులో గాని ఐదు నుండి పది సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. దేవాదాయ శాఖ నుండి విడుదలైన ఉద్యోగుల యొక్క పూర్తి సమాచారం ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు?:

Join Whats App Group

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణ దేవాదాయ శాఖ
పోస్టుల పేరు లీగల్ ఆఫీసర్ , అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్
అర్హతలు అడ్వకేట్ గా పని చేస్తూ ఐదు నుంచి పది సంవత్సరాలు అనుభవం ఉండాలి
జీతం 44 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు జీతం ఉంటుంది
ఆఖరి తేదీ 15th డిసెంబర్, 2025
అధికారిక వెబ్సైట్Click Here

ఉద్యోగాల అర్హతలు?:

తెలంగాణ దేవాలయ శాఖ ని విడుదలైన లీగల్ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తెలంగాణ జిల్లా కోర్టులో గాని లేదా హైకోర్టులో గాని ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలు అడ్వకేట్ గా అనుభవం ఉన్నవారికి అవకాశం ఉంటుంది.

అటవీ శాఖలో ఇంటర్ అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు: Apply

శాలరీ వివరాలు?:

లీగల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ లీగల్ ఆఫీసర్గా ఎంపికైన వారికి పోస్ట్లను అనుసరించి నెలకు ₹44 వేల రూపాయల నుండి ₹లక్ష రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావున ఎటువంటి అలవెన్స్ ఉండవు.

ఎంపిక విధానం?:

దరఖాస్తు చేసుకున్న వారిని ఈ క్రింది విధంగా ఎంపిక చేస్తారు.

తెలంగాణ అంగన్వాడిలో 14 వేలకు పైగా టీచర్, హెల్పర్ ఉద్యోగాలు

  1. ముందుగా అభ్యర్థులు అప్లికేషన్స్ ని అర్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు.
  2. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  3. అన్ని అర్హతలు ఉంటే పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్?:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన గడువులోగా ఈ క్రింది అడ్రస్కు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను పంపించాలి.

  • అడ్రస్: ది కమిషనర్, తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, తెలంగాణ బొగ్గులకుంట, తిలక్ రోడ్ , అబిడ్స్, హైదరాబాద్ – 500 001.

ముఖ్యమైన లింక్స్:

తెలంగాణ దేవాదాయ శాఖ కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోండి.

Notification PDF

Application Form

అప్లికేషన్ ఆఖరి తేదీ?:

దేవదాయ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు డిసెంబర్ 15, 2025 వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

Note: పైన తెలిపిన పూర్తి వివరాలు చూసిన తర్వాత మీకు అర్హతలు ఉన్నట్లయితే వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.