అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | ICFRE Notification 2025

ICFRE Forest Dept. Notification 2025:

కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబంధించిన ఇండియన్ కౌన్సిలర్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి పరీక్ష మరియు ఫీజు లేకుండా కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కనీసం రెండు సంవత్సరాలు సంబంధిత ఫీల్డ్ లో అనుభవం కలిగినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తారు. 40 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాల యొక్క అర్హతలు వయస్సు సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

Join Whats App Group

అంశము వివరాలు
సంస్థ పేరు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్
పోస్టుల పేర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్
అర్హతలు ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత
శాలరీ₹16,000/- నుండి ₹42,000/- వరకు ఉంటాయి
ఆఖరి తేదీ27త నవంబర్, 2025
ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఉద్యోగాల అర్హతలు:

అటవీ శాఖ నుండి విడుదలైన కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ , ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత లేదా ఇంటర్మీడియట్ కలిగి కనీసం రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యతను ఇచ్చి ఈ ఉద్యోగాలు ఇస్తారు.

అంగన్వాడీలో 14,236 ఉద్యోగాలు : 10th లేదా ఇంటర్ అర్హత

ఎంత వయస్సు ఉండాలి?:

అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్టంగా 40 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు?:

పోస్టులను అనుసరించి అటవీ శాఖ ఉద్యోగాలకు ఈ క్రింది విధంగా శాలరీలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ : ₹16,000/-
  • ఇన్ఫర్మేషన్ ఆఫీసర్: ₹42,000/-

ఎంపిక విధానం?:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఎంపిక చేస్తారు.

ఏపీ పౌరసరఫరాల శాఖలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

  1. ముందుగా అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు.
  2. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  3. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
  4. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగాలు ఇస్తారు
  5. ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : 27th నవంబర్, 2025

ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం?:

అటవీ శాఖ ఉద్యోగాలకు నవంబర్ 27వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నందున, అభ్యర్థులు వారి యొక్క అర్హత సర్టిఫికెట్స్ అప్లికేషన్ ఫారం, ఇతర డాక్యుమెంట్స్ తీసుకొని ఈ క్రింది అడ్రస్ కు ఇంటర్వ్యూకి హాజరు కావలెను.

  • ఇంటర్వ్యూ ప్రదేశం : FRI మెయిన్ బిల్డింగ్, P.O, న్యూ ఫారెస్ట్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డెహ్రాడూన్ – 248006.

ముఖ్యమైన లింక్స్?:

ఈ క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

Notification PDF

Official Website

Note: పైన తెలిపిన పూర్తి వివరాలు చూసిన అభ్యర్థులు మీకు అర్హతలు ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి.