గ్రామీణ వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్| NABFINS Notification 2025

NABFINS (NABARD) Notification 2025:

వ్యవసాయ శాఖ నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన (NABFINS) డిపార్ట్మెంట్ నుండి 10+2 అర్హతతో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయస్సు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకోండి.

పోస్టుల ముఖ్యమైన వివరాలు?:

Join Whats App Group

అంశము వివరాలు
సంస్థ పేరుNABARD యొక్క NABFINS డిపార్ట్మెంట్
పోస్ట్ పేరు కస్టమర్ సర్వీస్ ఆఫీసర్
అర్హతలు ఇంటర్ లేదా 10+2 అర్హత
వయస్సు 18 నుండి 33 సంవత్సరాలు
ఆఖరు తేది28th నవంబర్, 2025
వెబ్సైట్ లింక్Click Here

పోస్టుల అర్హతలు?:

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నుండి విడుదలైన కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ లేదా 10+2 అర్హత కచ్చితంగా ఉండాలి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారిగా పోస్ట్లను విడుదల చేశారు.

గ్రామీణ పోస్టల్ శాఖలో 10వ తరగతి అర్హతతో డైరెక్ట్ జాబ్స్: No Exam

ఎంత వయసు ఉండాలి?:

18 నుండి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రైవేటు విధానంలో భర్తీ చేస్తున్నందున ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో రిజర్వేషన్ కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు ఉండదు.

ఎంత శాలరీ ఉంటుంది?:

కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹25,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర ఎలెవెన్సెస్ లేదా బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply

ఎంపిక విధానం?:

నాబార్డ్ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

  1. ముందుగా అర్హతలను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తారు.
  2. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  3. ఎటువంటి రాత పరీక్ష ఉండదు
  4. అర్హులైన వారికి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్:

కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ నాబార్డ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.

  • ముందుగా అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
  • అక్కడ మీరు ఎంచుకున్న రాష్ట్రం యొక్క అప్లికేషన్ ని క్లిక్ చేయండి
  • అప్లికేషన్ పూర్తి చేసి తప్పులు లేకుండా సబ్మిట్ చేయండి.
  • ఫీజు లేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఆఖరి తేదీ?:

ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 28, 2025వ తేదీలోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయవలెను. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

ముఖ్యమైన లింక్స్:

నాబార్డ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

Notification Link

Apply Online

Note: పైన తెలిపిన పూర్తి వివరాలు చూసిన అభ్యర్థులు మీకు అర్హతలు ఉన్నట్లయితే గడువులోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.