రైల్వేలో కొత్తగా 4,116 పోస్టులకు పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ: RRC 4,116 Jobs Notification 2025

Railway recruitment notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ర్న్ రైల్వే నుండి 4,116 పోస్టులతో అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి అర్హతతో పాటు ఐటిఐ లో రాత కలిగినటువంటి వారు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. నోటిఫికేషన్ ద్వారా అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ యొక్క పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.

పోస్టుల యొక్క ముఖ్యాంశాలు?:

Join Whats App Group

అంశము వివరాలు
సంస్థ పేరునార్త్ర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్
మొత్తం పోస్టులు4,116
పోస్టుల పేరు అప్రెంటిషిప్ ఖాళీలు
అర్హతలు10th, ITI/10+2 అర్హత
ఆఖరు తేదీ24th డిసెంబర్, 2025
ఎంపిక విధానం కేవలం మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక
అధికారిక వెబ్సైట్Click Here

అర్హతలు:

నార్తన్ రైల్వే నుండి విడుదలైన 4,116 అప్రెంటిషిప్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టెన్త్ అర్హతతో పాటు ఐటిఐ లో సంబంధిత ట్రేడ్లో అర్హతలు ఉన్న వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుభవం ఏమి అవసరం లేదు.

పంచాయతీరాజ్ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్టర్ జాబ్స్

ఎంత వయసు ఉండాలి?:

రైల్వే అప్రెంటిషిప్ కాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనిష్టంగా 15 సంవత్సరాల నుంచి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు?:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. ఇతర రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము ఉండదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల

ముఖ్యమైన తేదీలు?:

రైల్వే అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది ముఖ్యమైన తేదీలలో దరఖాస్తు చేసుకోవాలి

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 25th నవంబర్, 2025
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ : 24th డిసెంబర్, 2025
  • మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : ఫిబ్రవరి, 2025

ఎంత స్టెఫండ్ ఉంటుంది?:

రైల్వే అప్రెంటిస్ట్ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 15 వేల రూపాయల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ఇవి అప్రెంటిషిప్ ఖాళీలు అయినందున వీటికి ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు

సెలక్షన్ ప్రాసెస్?:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ఆన్లైన్ అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేస్తారు
  2. ఎటువంటి రాత పరీక్ష ఉండదు
  3. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
  5. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు

ముఖ్యమైన లింక్స్:

రైల్వే అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని గడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేయండి.

Notification PDF

Online Apply Link

Note: నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హతలు కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి.