NIRDPR Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 04 రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 50 సంవత్సరాల లోపు వయసు కలిగి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీహెచ్డీ లో లేదా అగ్రికల్చర్ ఎలైట్ సెక్టార్స్లో లేదా ఎకనామిక్స్ లో సోషల్ సైన్సెస్, ఎంబీఏ లేదా స్టాటిస్టిక్స్ వంటి సబ్జెక్ట్స్ లో అర్హత కలిగి రెండు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. MS office లో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:
| అంశము | వివరాలు |
| శాఖ లేదా సంస్థ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ (NIRDPR) |
| పోస్ట్ పేరు | రీసెర్చ్ అసోసియేట్ |
| మొత్తం పోస్టులు | 04 |
| అప్లికేషన్ ప్రాసెస్ | ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి |
| ఆఖరి తేదీ | 27th నవంబర్, 2025 |
| అర్హతలు | పోస్ట్ గ్రాడ్యుయేషన్ /PhD/ ఎకనామిక్స్ /MBA/ అగ్రికల్చర్ మరియు ఎలైట్ సెక్టార్స్ |
| అధికారిక వెబ్సైట్ | Website Link |
ఎంత వయస్సు ఉండాలి?:
పంచాయతీరాజ్ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్టంగా 50 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉండే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు
ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు?:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీహెచ్డీ లో లేదా అగ్రికల్చర్ ఎలైట్ సెక్టార్స్లో లేదా ఎకనామిక్స్ లో సోషల్ సైన్సెస్, ఎంబీఏ లేదా స్టాటిస్టిక్స్ వంటి సబ్జెక్ట్స్ లో అర్హత కలిగి రెండు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు ఉందా?:
పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు ఫీజు అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో టెన్త్ అర్హతతో డైరెక్ట్ జాబ్స్
సెలక్షన్ చేసే విధానం?:
NIRDPR ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క సెలక్షన్ ప్రాసెసింగ్ క్రింది విధంగా ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులకు ఆన్లైన్ అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు
- అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- అన్ని అర్హతలు కలిగిన వారికి డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ వివరాలు?:
NIRDPR ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹40 వేల రూపాయలు శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల వెలివెన్సెస్ కూడా చెల్లిస్తారు.
అప్లై చేసే విధానం?:
అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. కావలసిన సర్టిఫికెట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయవలెను.
అప్లికేషన్ ఆఖరి తేదీ ?:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 27,2025 వ తేదీలోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన లింక్స్?:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని గడువులోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయండి.
Note: పైన తెలిపిన పూర్తి వివరాలు చూసి అర్హతలు ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
