AP Endowment Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 18 నవంబర్ 2025న అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వేద పాఠశాలల్లో బోధించే పలు విభాగాల ఉద్యోగాలను నియామకం చేయడానికి దేవదాయ శాఖ ఆహ్వానం పలికింది. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా వేద పారాయణదారులు, అర్చకులు, అధ్యాపకులు, భక్త మిత్రులు, ఇతర ధార్మిక సేవాదారుల వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏపీ దేవాదాయ శాఖ ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:
| అంశము | వివరాలు |
| విడుదల చేసిన శాఖ | ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ |
| ప్రకటన తేదీ | 18th నవంబర్, 2025 |
| అర్హులు | పేద పారాయణదారులు, అర్చకులు, పురోహితులు, అధ్యాపకులు, బజంత్రీలు, పరిచారకులు మరియు ఇతర పోస్టులు |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
| వెబ్ సైట్ లింక్ | http://www.apendts.religiousrecruitment.in |
| చివరి తేదీ | 21st డిసెంబర్, 2025 |
| ఎంపిక విధానం | అర్హత, అనుభవం, ధార్మిక జ్ఞానం ఆధారంగా |
నియామకానికి అర్హులైన వారు?:
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా పేర్కొన్నారు :
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్: 10th అర్హత
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రామాణిక దేవాలయాల్లో పనిచేసే
- వేద పారాయణ దారులు
- అర్చకులు
- అధ్యాపకులు
- భజంత్రీలు
- ఇతర ధార్మిక దేవాదాయ సిబ్బంది
- పురోహితులు
- వేద పండితులు
- ఆలయాలకు సంబంధించిన ఇతర ధార్మిక సేవా విభాగాలలో పనిచేసే వ్యక్తులు కూడా అర్హులు.
ఇవి అన్ని ఇప్పటికీ ధార్మిక సేవలో పని చేసే వ్యక్తులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఎంపిక చేసే విధానం?:
తెలంగాణ దేవాదాయ శాఖలో 324 ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతి
- అభ్యర్థులను అర్హతల ప్రకారం
- సంబంధిత ధార్మిక విద్యా జ్ఞానం,
- సేవల అనుభవం ఆధారంగా పరిశీలించి ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీరు అధికారికి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.
దరఖాస్తులు సమర్పించాల్సిన అధికారిక వెబ్సైట్?:
ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు ఈ క్రింది అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి.
- website link : http://www.apendts.religiousrecruitment.in
- Notification PDF
ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడవు. నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా తెలిపారు.
దరఖాస్తు చివరితేదీ:
దేవదయ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు డిసెంబర్ 21, 2025వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.
- అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేసి దరఖాస్తులు చేసుకోవాలి.
ముఖ్య గమనిక:
- అర్హులైన అభ్యర్థులు తమ అనుభవ సర్టిఫికెట్లు,
- ధార్మిక విద్యా సర్టిఫికెట్లు
- సేవా ధ్రువ పత్రాలు సరైన రూపంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
- పోస్టుల సంఖ్యను అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పోస్టుల సంఖ్య వచ్చే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ ఇప్పటికే ఆధ్యాత్మిక సేవలో ఉన్న వ్యక్తులకు మాత్రమే. కావున అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
