ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు | AP WDCW Notification 2025

AP WDCW Notification 2025:

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 04 సెక్యూరిటీ గార్డ్, మల్టీపర్పస్ స్టాప్, సైకో సోషల్ కౌన్సిలర్ పోస్ట్లను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి 7th, 10th మరియు డిప్లమా లేదా సైకాలజీలో అర్హతలు కలిగిన అభ్యర్థులు నిర్ణీత గొడవ దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ మరియు శిశువు సంక్షేమ శాఖ నుండి విడుదలైన పోస్ట్లు వివరాలు వాటి యొక్క అర్హతలు ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోగలరు.

Join Whats App Group

పోస్ట్ పేరు అర్హతలు
సైకో సోషల్ కౌన్సిలర్డిప్లొమా / సైకాలజీలో డిగ్రీ
మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్10th అర్హత
సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్7th అర్హత / తెలుగు చదవడం, రాయడం రావాలి

ఎంత వయస్సు ఉండాలి:

ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనిష్టంగా 25 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ప్రభుత్వ నిబంధనలను అనుసరించి.

దేవాదాయ శాఖలో 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి : అర్హతలు

ఎంపిక చేసే విధానం?:

మహిళా వృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.

  • ముందుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ ని షార్ట్ లిస్టు చేస్తారు.
  • అర్హతలు, వయస్సు మరియు అనుభవం కలిగిన వారిని ఎంపిక చేస్తారు.
  • ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉండదు.
  • డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  • అన్ని అర్హతలు ఉన్నవారికి పోస్టింగ్ ఇస్తారు.

పోస్టుల వారీగా శాలరీస్ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు 13 వేల రూపాయల నుండి 20వేల రూపాయలకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగులైనందున ఇతర ఎలివేషన్స్ ఏమీ ఉండవు.

ఏపీ మరియు తెలంగాణ స్కూల్ విద్యార్థులకు వరుసగా 8 రోజులు సెలవులు

ఎలా అప్లై చేయాలి?:

ఆంధ్రప్రదేశ్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేయండి.
  2. అప్లికేషన్ ఫారంని ఎటువంటి తప్పులు లేకుండా పదవ తరగతి అర్హత సర్టిఫికెట్స్ ఆధారంగా చేసుకుని పూర్తి చేయండి.
  3. అప్లికేషన్ ఫారం తో పాటు ఇతర డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి, గడువులోగా సంబంధిత డిపార్ట్మెంట్ అడ్రస్ కు పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపించండి.
  4. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన లింక్స్:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకోగలరు.

Notification PDF & Application

Official Website

ముఖ్యమైన తేదీలు:

ఏపీ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు నవంబర్ 25, 2025వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.

Note: పైన తెలిపిన పూర్తి సమాచారం చూసి అరుగులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు గడువు ఆఖరి తేదీలోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయండి.